ఎత్తిపోతల భూసేకరణకు రైతులు సహకరించాలి
ABN , Publish Date - Jul 19 , 2025 | 01:05 AM
ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి భూసేకరణకు రైతులు సహకరించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు.
హుజూర్‌నగర్ , జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి భూసేకరణకు రైతులు సహకరించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. శుక్రవారం హుజూర్‌నగర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ నేత నిజాముద్దీన్ సంతాపసభలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ కొత్త ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి పైప్‌లైన్లు వేసేందుకు అవసరమైన భూసేకరణ కు రైతులు సహకరించాలన్నారు. 55వేల ఎకరాలకు సాగునీరు అందించేందు కు రూ.1800 కోట్లతో ముక్త్యాల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించామని, భూ సేకరణలో రైతులు అవాంతరాలు కలిగించవద్దన్నారు. భూసేకరణకు భూము లు ఇచ్చే రైతులకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందన్నారు. మార్కెట్ కంటే అదనపు ధర కల్పిస్తున్నామని, రైతులు మం చి ఆలోచనతో భూమి ఇవ్వాలని కోరారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణ బాధ్యతను రైతులు సమష్ఠిగా తీసుకోవాలన్నారు. ఎంబీ కెనాల్‌పై కూలిన వంతెన స్థానంలో కొత్త వంతెనను నిర్మిస్తామన్నారు. దివంగత కాంగ్రెస్ నేత నిజాముద్దీన్ విగ్రహఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో కోదాడ ఎమ్మె ల్యే పద్మావతిరెడ్డి, వేనేపల్లి చందర్‌రావు, తన్నీరు మల్లికార్జున్‌రావు, యరగాని నాగన్న, ఈడ్పుగంటి సుబ్బారావు, దొంగరి వెంకటేశ్వర్లు, గొట్టె రామయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్‌కుమార్, మార్కెట్ చైర్మన రాధిక, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దొంగరి సత్యనారాయణ, మాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాసు, జక్కుల వెంకయ్య, లక్ష్మీనారాయణరెడ్డి, చక్కెర వీరారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మంజూనాయక్, పెండెం శ్రీనివాస్, కొట్టే సైదేశ్వరరావు, అజీజ్‌పాషా, దొంతగాని శ్రీనివాస్, సంత్‌పరెడ్డి, గోపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.