నకిలీ విత్తనాల దందా?
ABN , Publish Date - Jul 15 , 2025 | 12:39 AM
వానాకాలం సీజన సాగు ఇటీవల పెరిగింది. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో వానాకాలం, యాసంగి సీజన్లలో అత్యధికంగా వరిసాగు జరగుతున్న మండలాల్లో గరిడేపల్లి ఒకటి. దీనిని ఆసరాగా తీసుకుని మండలంలో వరి విత్తన తయారీ కేంద్రాలతో పాటు, విక్రయకేంద్రాలు కూడా విపరీతంగా వెలిశాయి.
గరిడేపల్లి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సీజన సాగు ఇటీవల పెరిగింది. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో వానాకాలం, యాసంగి సీజన్లలో అత్యధికంగా వరిసాగు జరగుతున్న మండలాల్లో గరిడేపల్లి ఒకటి. దీనిని ఆసరాగా తీసుకుని మండలంలో వరి విత్తన తయారీ కేంద్రాలతో పాటు, విక్రయకేంద్రాలు కూడా విపరీతంగా వెలిశాయి. అదేవిధంగా నకిలీ వరి విత్తనాలు తయారీచేస్తూ పెద్దమొత్తంలో రైతులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వరి విత్తనాలు కొనుగోలు చేసి రైతులు దిగుబడులు రాక నష్టపోయి ఆందోళనలు చేపట్టి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఘటనలు మండలంలో ఉన్నాయి. విత్తన కంపెనీలు నిబం ధనల ప్రకారం విత్తనాలను తయారీ చే యాల్సి ఉన్నా, వాటిని పాటించకుండా ఇ ష్టానురీతి గా విత్తనాలను తయారీ చేసి రైతులకు అంటగుడుతున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ శాఖాధికారుల ఇక్కడ తయారవుతున్న విత్తనాల నమూనాలను తీ సి ల్యాబ్‌కు పంపి ఎంత శాతం మొలకెత్తుఉన్నా యో రైతులకు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులు ఎన్ని కంపెనీలకు ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. విత్తనాలను తయారీ చేసే సీడ్ కంపెనీలు ప్రభుత్వ, వ్యవసాయ శాఖ అనుమతులు తీసుకొని ఆ తర్వాత ఆ ప్రాంతాల్లో విత్తన తయారీ యూనిట్లను ఏర్పాటుచేయాలి. అయితే రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయడం, వాటిని ప్రాసెసింగ్ చేయడం సంచుల్లో నింపి ఇస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. కానీ వాటిని ప్రాసెసంగ్ చేసిన తర్వాత ఎంత కాలానికి విత్తనాలు మొలకెత్తుతాయి, వాటికి 80శాతం జర్మినేషన వచ్చిందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఆ తర్వాతనే కంపెనీ ముద్రలు ఉన్న బ్యాగుల్లో నింపి విక్రయాలు చేపట్టాలి. అవేమీ జరుగకుండానే నకిలీ విత్తనాల విక్రయాలు సాగుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. గతం నుంచి గడ్డిపల్లి విత్తనాలకు మంచి పేరు ఉండడంతో కొందరు దాన్ని తమ నకిలీ విత్తనాల విక్రయానికి అనుకూలంగా వాడుకుంటున్నట్లు పలువురు ఆరోపిస్తున్నా రు. గడ్డిపల్లిలోని పలు కంపెనీలకు అనుమతులు ఉన్నా వాటి మాటున కొన్నిచోట్ల అక్రమంగా ప్రాసెసింగ్ చేస్తూ అనుమతులు ఉన్న ముద్రలు వేస్తూ బ్యాగుల్లో నింపి విక్రయిస్తున్నారని కొందరు రైతులు పేర్కొంటున్నారు. సూటి రకం విత్తనాలు తయారు చేసేటప్పుడు కూడా విత్తన తయారీ కంపెనీలు తగు జాగ్రత్తలు తీసుకొంటే దిగుబడులు వస్తాయని పలువురు రైతులు పేర్కొంటున్నారు. అమాయక రైతుల ను లక్ష్యంగా చేసుకొని నకిలీ విత్తనాలను విక్రయిస్తు న్నా వ్యవసాయశాఖాధికారులు తెలిసీతెలియనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణులన్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి నకిలీ సీడ్ విక్రయాల కు అడ్డుకట్ట వేయాలని రైతులు కోరుతున్నారు.
ఎలాంటి ఆధారాలు లేవు
నకిలీ విత్తనాల విక్రయాలపై ఎలాంటి ఆధారాలు లేవు. ప్రతీసా రి మండలంలోని అన్ని విత్తనకేంద్రాలను తనిఖీ నిర్వహించి రికార్డులను పరిశీలిస్తు న్నాం. ఎక్కడ కూడా అనుమతులు లేకుండా విత్తనాలు విక్రయించిన కేంద్రాలు కనిపించలేదు. నకి లీ విత్తనాలు విక్రయించినట్లు ఎవరైనా రైతులు మాదృష్టికి తెస్తే తనిఖీ నిర్వహించి, నకిలీ విత్తనాలుగా తేలితే వారిపై కఠినచర్యలు తీసుకుంటాం.
- ప్రీతం కుమార్, మండల వ్యవసాయాధికారి