ఆర్టీసీ ఆదాయానికి ఈవీ దన్ను
ABN , Publish Date - May 09 , 2025 | 12:04 AM
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాల ఊబి నుంచి బయటపడేందుకు అనేకమార్గాలు అనుసరిస్తోంది. అందులో భాగంగా ఎలకి్ట్రకల్ బస్సు(ఎలకి్ట్రకల్ వెహికల్స్(ఈవీ)లను తీసుకువస్తోంది.
10 రోజుల్లో రోడ్లపైకి ఎలకి్ట్రకల్ బస్సులు
సూర్యాపేటకు చేరుకున్న 45 సర్వీసులు
నల్లగొండ, సూర్యాపేటలో చార్జింగ్ స్టేషన్లు పూర్తి
తగ్గనున్న ఖర్చు
డీజిల్ బస్సులు తక్కుకు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాల ఊబి నుంచి బయటపడేందుకు అనేకమార్గాలు అనుసరిస్తోంది. అందులో భాగంగా ఎలకి్ట్రకల్ బస్సు(ఎలకి్ట్రకల్ వెహికల్స్(ఈవీ)లను తీసుకువస్తోంది. డీజిల్ బస్సులతో ఖర్చుతో పాటు పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో విడతల వారీగా ఈవీలను నడపాలని నిర్ణయించింది. నల్లగొండ రీజియన పరిధిలో మొదటగా సూర్యాపేట, నల్లగొండ డిపోల పరిధిలో తీసుకువచ్చేందుకు ప్రణాళిక రూపొందించి ఆయా డిపోల్లో విద్యుత బస్సులను ఛార్జీంగ్ చేసేందుకు అవసరమైన స్టేషన్ల పనులు పూర్తిచేశారు. దీంతో 10 రోజుల్లో సూర్యాపేటలో ఆర్టీసీ ఎలకి్ట్రకల్ బస్సులు రోడ్డెక్కనున్నాయి.
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట(కలెక్టరేట్)
ఎలకి్ట్రకల్ బస్సుల కాంట్రాక్టు దక్కించుకున్న జేబీఎం సంస్థ నల్లగొండ రీజియన పరిధిలోని సూర్యాపేట డిపోకు ఇప్పటికే 45 విద్యుత బస్సులు పంపించింది. నల్లగొండ డిపోకు త్వరలో రానున్నాయి. ఆయా బస్సులను చార్జింగ్ చేసేందుకు అవసరమైన స్టేషన్లను ఆయా డిపోల్లో సిద్ధం చేశారు. బస్సులు రోడ్డెక్కగానే ప్రస్తుతం నడుస్తున్న డీజిల్ బస్సుల్లో పాత వాటిని తొలగించనున్నారు. వాటిని తుక్కు కిందకు పంపనున్నారు. అయితే సూర్యాపేట డిపో నుంచి విద్యుత బస్సులు రోడ్డెక్కెందుకు ప్రధానంగా విద్యుత అవసరం ఉంది. చార్జింగ్ కోసం 33/11కేవీ విద్యుత లైన అవసరం కాగా జేబీఎం సంస్థ విద్యుత సంస్థ నుంచి ప్రత్యేకంగా డిపోలకు విద్యుత లైనను ఏర్పాటుచేసుకుంటుంది. అయితే సూర్యాపేటలో విద్యుతలైన ఏర్పాటులో ఆలస్యంకావడంతో విద్యుత బస్సులు రోడ్డెక్కేందుకు ఆలస్యమవుతోంది. త్వరలో విద్యుత లైన పనులు పూర్తికానున్నాయి.
రూ.20 నుంచి రూ.7కు తగ్గిన ఖర్చు
ఎలకి్ట్రకల్ బస్సులతో ఆర్టీసీకి ఖర్చు తగ్గనుంది. ప్రస్తుతం డీజిల్ బస్సులకు కిలోమీటరు సుమారు రూ.20 వరకు ఆర్టీసీకి ఖర్చు వస్తోంది. అదే విద్యుత బస్సులతో అయితే కిలోమీటరుకు రూ.6 నుంచి రూ.7 వరకు ఖర్చు రానుంది. దీంతో ఆర్టీసీ సంస్థకు ఖర్చు తగ్గనుంది. అంతేకాకుండా విద్యుత బస్సుల నిర్వహణ కూడా ఆర్టీసీకి సంబంధం లేదు. బస్సుల చార్జింగ్, విద్యుత బిల్లులు, బస్సుల మెయింటెన్స, డ్రైవర్ల వేతనాలు కూడా జేబీఎం సంస్థ చెల్లించనుంది. దీంతో ఆర్టీసీపై ఆర్థికభారం తగ్గనుంది.
పూర్తయిన మొదటి విడత డ్రైవర్ల నియామకం
విద్యుత బస్సులను నడిపేందుకు అవసరమైన డ్రైవర్లను ఇప్పటికే నియమించారు. జేబీఎం సంస్థ ఆధ్వర్యంలో అవసరమైన డ్రైవర్లను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చారు. రెండో విడత డ్రైవర్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. విద్యుత బస్సులతో డ్రైవర్లకు పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఆటో గేర్ కావడంతో ఎలాంటి అలసట లేకుండా బస్సులను నడిపే అవకాశాలు ఉన్నాయి. డీజిల్ బస్సులకు తరుచూ గేర్లు మార్చాల్సి ఉండటంతో ఇబ్బంది పడేవారు. విద్యుత బస్సులకు ఎలాంటి గేర్లు ఉండవు, ఎక్స్‌కలేటర్‌పై కాలుమోపితే వెంటనే వేగాన్ని అందుకుంటుంది.
పర్యావరణ రహితం
విద్యుత బస్సులతో పర్యావరణానికి మేలు జరుగనుంది. డీజిల్ బస్సుల పొగతో అటు పర్యావరణానికి, ఇటు ప్రయాణికులకు కాలుష్య సమస్య ఉండేది. ఇప్పుడా సమస్య ఉండకపోవడంతో పాటు ప్రయాణికులు స్వచ్ఛమైన గాలిని తీసుకునే వీలు కలుగుతుంది. దీనికి తోడు శబ్ధకాలుష్యం కూడా ఉండదు. విద్యుత బస్సులకు ముందు, వెనుక భాగంలో సస్పెన్షర్లు ఏర్పాటుచేశారు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి కుదుపులు లేకుండా హాయిగా ప్రయాణించవచ్చు. అదేవిధంగా బస్సులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ప్రయాణికుల వివరాలు నమోదు కానున్నాయి.
ఒకసారి చార్జింగ్‌తో 300 కిలోమీటర్ల వరకు..
విద్యుత బస్సులకు ఒకసారి చార్జింగ్ చేస్తే సుమారు 250 నుంచి 300 కిలోమీటర్లు వరకు ప్రయాణం చేయనున్నాయి. బస్సుకు ఫుల్ చార్జింగ్ చేయడానికి గంటన్నర సమయం పట్టనుంది. సూర్యాపేట, నల్లగొండ డిపోల్లో విద్యుత బస్సులను చార్జింగ్ చేసేందుకు ఒక్కో డిపోలో 14 స్టేషన్లు ఏర్పాటుచేశారు.
సమీప ప్రాంతాలకు మాత్రమే..
ప్రస్తుత డీజిల్ బస్సుల మాదిరిగా దూరప్రాంతాలకు విద్యుత బస్సులు వెళ్లలేవు. డీజిల్ అయిపోతే సమీపంలోని డిపోలో నింపుకునే వారు కానీ విద్యుత బస్సులు 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే వాటికి చార్జింగ్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అన్ని డిపోల్లో చార్జింగ్ స్టేషన్లు లేవు. దీంతో ప్రస్తుతానికి సమీపంలోని పట్టణాలు, గ్రామాలకు మాత్రమే విద్యుత బస్సులు నడపనున్నారు. ఎక్కువగా ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులు ప్రస్తుతం సిద్ధంగా ఉండడంతో ఆర్టీసీ అధికారులు వీటిని హైదరాబాద్, విజయవాడ, నల్లగొండ, ఖమ్మంతో పాటు 300 కిలోమీటర్లలోపు దూరం ఉన్న పట్టణాలకు నడిపించనున్నారు.
పర్యావరణానికి మేలు
సూర్యాపేట డిపోలో విద్యుత బస్సులు త్వరలో రోడ్డెక్కనున్నాయి. విద్యుత లైన ఏర్పాటులో ఆలస్యమైంది. నల్లగొండ డిపోకూ విద్యుతబస్సులు రానున్నాయి. ఈ బస్సులతో ఆర్టీసీకి ఖర్చు తగ్గనుంది. పర్యావరణానికి కూడా మేలు చేకూరనుంది. ప్రయాణికులకు కూడా సుఖప్రయాణం కలగనుంది. విద్యుత బస్సులు నడిపేందుకు అవసరమైన డ్రైవర్లను నియామకం చేసి వారికి శిక్షణ పూర్తిచేశారు.
జానరెడ్డి, నల్లగొండ రీజనల్ మేనేజర్