Share News

యాదగిరీశుడికి శాస్త్రోక్తంగా నిత్యపూజలు

ABN , Publish Date - Apr 11 , 2025 | 12:42 AM

యాదగిరిగుట్ట, ఏప్రి ల్‌ 10(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రంలో గురువారం నిత్య కైంకర్యాలు పాంచారాత్రగమశాస్త్ర రీతిలో అత్యం త వైభవంగా నిర్వహించారు.

 యాదగిరీశుడికి శాస్త్రోక్తంగా నిత్యపూజలు

యాదగిరిగుట్ట, ఏప్రి ల్‌ 10(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రంలో గురువారం నిత్య కైంకర్యాలు పాంచారాత్రగమశాస్త్ర రీతిలో అత్యం త వైభవంగా నిర్వహించారు. ప్రధానాలయ నై రుతి దిశలో అష్టభుజి ప్రాకార మండపంలో ఉ త్సవమూర్తులను పట్టువస్త్రాలు, ముత్యాలు, బం గారు, వజ్ర వైఢూర్యాల తో దివ్యమనోహరంగా అలంకరించిన అర్చకులు గజవాహన సేవలో తీర్చిదిద్ది వేద మంత్ర పఠనా లు, మంగళవాయిద్యాల నడుమ సేవోత్సవం చేపట్టారు. ఉత్సవమూర్తులను కల్యాణ మండపంలో అ ధిష్టింపజేసి, విష్వక్సేనుడి తొలిపూజలతో కల్యాణతంతు కొనసాగింది. కల్యాణోత్సవంలో పాల్గొన్న భ క్తులకు స్వామివారి శేషవస్త్రాలు, ఆశీర్వచనం అందజేశారు. ముందుగా సుదర్శన శతక పఠనంతో హోమం పూజలు నిర్వహించారు. ప్రభాతవేళ గర్భాలయంలో స్వామిఅమ్మవార్లను సుప్రభాత సేవ తో మేల్కొలిపి అర్చకస్వాములు నిజాభిషేకం, నిత్యార్చనలు చేపట్టారు. పాతగుట్ట ఆలయంలో నిత్య పూజలు జరిగాయి. కొండపైన శివాలయంలో పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామికి నిత్య పూజలు, యాగశాలలో నిత్య రుద్రహవనం శైవాగమ పద్ధతిలో నిర్వహించారు. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.19,47,072 ఆదాయం సమకూరినట్లు ఈవో భాస్కర్‌రావు తెలిపారు.

మట్టపల్లిలో నిత్య కల్యాణం

మఠంపల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మట్టపల్లి శ్రీలక్ష్మీ నృసింహుని క్షేత్రంలో గురువారం శ్రీరాజలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీ నరసింహుని నిత్యకల్యాణం వేదపండితులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయ ప్రకారం ఆర్జిత కైంకర్యాలు జరిగాయి. ఉదయం హోమాధికాలు భక్తిశ్రద్ధలతో చేశారు. తదుపరి కల్యాణ మూర్తులను పరిణయోత్సవ వేదికపైకి వేంచేయించి పుణ్యాహవాచనం గావించారు. మాంగళ్యధారణ, యజ్ఞోపవీతధారణ అనంతరం దివ్యమూర్తులకు గరుడోత్సవం జరిగింది. ఆలయ తిరువీధుల్లో స్తంభోద్భవుడిని ఊరేగించారు. అనంతరం దేవతామూర్తులను ఆలయ ప్రవేశం చేయించారు. మధ్యాహ్నం అమ్మవారికి కుంకుమార్చన, విశేషపర్వాలు నిర్వహించారు. కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ చెన్నూరి విజయ్‌కుమార్‌, మట్టపల్లిరావు, ఈవో సిరికొండ నవీన్‌, ఆలయ అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 12:42 AM