Share News

పక్కా నిర్మాణాలకు ‘ఉపాధి’ నిధులు

ABN , Publish Date - Jun 18 , 2025 | 12:03 AM

యాదాద్రిభువనగిరి జిల్లాకు రూ.8.47 కోట్ల కేంద్ర నిధులు మంజూరయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి జాతీయ ఉపాధిహామీ పథకం కింద మంజూరైన ఈ నిధులతో ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్‌ నియోజకవర్గాల్లో 63 శాశ్వతనిర్మాణ పనులు చేపట్టనున్నారు.

పక్కా నిర్మాణాలకు ‘ఉపాధి’ నిధులు

యాదాద్రిభువనగిరి జిల్లాకు రూ.8.47 కోట్ల కేంద్ర నిధులు మంజూరయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి జాతీయ ఉపాధిహామీ పథకం కింద మంజూరైన ఈ నిధులతో ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్‌ నియోజకవర్గాల్లో 63 శాశ్వతనిర్మాణ పనులు చేపట్టనున్నారు. అందులో 26 అంగనవాడీ కేంద్రాలు, 10 పంచాయతీ భవనాలు, 27 పాఠశాలలకు ప్రహరీ నిర్మించనున్నారు. ఆయాపనులతో గ్రామాల్లోని ఉపాధి కూలీలకు పనిదినాలు లభించనున్నాయి.

(ఆంధ్రజ్యోతి-భువనగిరి టౌన)

ఆలేరు నియోజకవర్గంలో రూ.5.06 కోట్లు, మునుగోడుకు రూ.1.19 కోట్లు, తుంగతుర్తికి రూ.1.48 కోట్లు, నకిరేకల్‌ నియోజకవర్గంలో రూ.74లక్షలతో ఉపాధి పనులు చేపట్టనున్నారు. అదేవిధంగా భువనగిరి నియోజకవర్గానికి ఈ దఫాలో నిధులు రాలేదు. ఆయాశాఖల అధికారుల ప్రతిపాదనల మేరకు కేంద్రం నిధులు మంజూరు చేసినట్టు తెలిసింది. కాగా జిల్లాకు రూ.8.47 కోట్ల నిధులు మంజూరు చేసిన ప్రధాని నరేంద్రమోదీకి మాజీ ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పడానికి ఈ నిధుల మంజూరునే ఉదాహరణ అని అన్నారు.

26 అంగనవాడీ కేంద్రాలకు రూ.3.12 కోట్లు

అద్దె భవనాలలో కొనసాగుతున్న 26 అంగనవాడీ కేంద్రాలను ఒక్కొక్కటి రూ.12 లక్షలతో రూ.3.12 కోట్లతో శాశ్వత భవనాలు నిర్మించనున్నారు. ఆలేరు నియోజకవర్గంలోని తూర్పుగూడెం, పటేల్‌గూడెం, రేలప్లె, ఉప్పల్‌పహాడ్‌, బొమ్మలరామారం రెండుకేంద్రాలు), నూనెగూడెం, అనంతరం, అమ్మనబోలు, శాకంపల్లి, మొల్లగూడెం, చల్లూరు, మలకలపల్లి, దామారం, సాదువేల్లి, చిన్నకందూకూర్‌, మునుగోడు నియోజవవర్గంలోని డీ.మల్కాపూర్‌, జై.కేసారం, నారాయణపూర్‌, జనగాం, నకిరేకల్‌ నియోజకవర్గంలోని ఎన్నారం, సిరిపురం, తుంగతుర్తి నియోజకవర్గంలోని అజీంపేట్‌, గోవిందాపూర్‌, దత్తప్పగూడెం, పాలడుగులో నిర్మించనున్నారు.

27 పాఠశాలకు రూ.3.55 కోట్లతో ప్రహరీలు

జిల్లాలోని 27 ప్రభుత్వ పాఠశాలలకు రూ.3.55 కోట్లతో ప్రహరీలు నిర్మిస్తారు. ఆలేరు నియోజకవర్గంలోని 17 పాఠశాలలకు రూ.1.94 కోట్లతో ప్రహరీలు నిర్మిస్తారు. ఈ మేరకు కొలనుపాక, తిమ్మాపూర్‌, నాగినేనిపల్లి, ఇక్కుర్తి, నెమిలె, పారుపల్లి, చిన్నకందూకూరు, దాతరుపల్లి జడ్పీహెచఎ్‌సలు, పల్లెపహాడ్‌, కొలనుపాక, ఆత్మకూరు(ఎం), నూనెగూడెం, వంగాల, చామాపూర్‌, కాసర్లగూడ తండా, గుజవారికుంట ఎంపీపీఎస్‌ పాఠశాలలు, మర్రిపడగా యూపీఎస్‌, మునుగోడు నియోజకవర్గంలోని పీపుల్‌పహాడ్‌, జనగాం ఉన్నతపాఠశాల, చింతలగూడెం, కొట్లాపూర్‌ ప్రాథమిక పాఠశాలలు, నకిరేకల్‌ నియోజకవర్గంలోని కొమ్మాయిగూడెం, ఎన్నారం జడ్పీహెచఎ్‌సలు, తుంగతుర్తి నియోజకవర్గం డీ.రేపాక, మోత్కూర్‌ జడ్పీహెచఎ్‌సలు, దామారం, అనాజిపూర్‌ ఎంపీపీఎ్‌సలకు ప్రహారి గోడలు నిర్మిస్తారు.

Updated Date - Jun 18 , 2025 | 12:03 AM