పల్లెల్లో ఎన్నికల సందడి
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:27 PM
స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారింది. ఆశావహుల అప్పుడే సందడి చేస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి- యాదాద్రి)
స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారింది. ఆశావహుల అప్పుడే సందడి చేస్తున్నారు. సెప్టెంబరులో రిజర్వేషన్ల ప్రక్రియ జరిగినా కోర్టు కేసులతో నిలిచిపోవడంతో నిరాశచెందారు. పాత పద్ధతిలోనే ఎన్నికల నిర్వహణ ఉంటుందనిచెప్పడంతో ఉత్సాహం నెలకొంది. అయితే జనరల్ స్థానాల్లో పెరగడంతో బీసీలు కొంత నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు. ఆర్డీవో కార్యాలయాల్లో ఆదివారం నిర్వహించిన డ్రాకు ప్రధానపార్టీల నాయకులు తరలిరావడంతో సందడి నెలకొంది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవడంతో ఆశావహులు గ్రామాల్లో వాలిపోయారు. ఎన్నికల పోరుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో సర్పంచల స్థానాలకు రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి.
ఆత్మకూరు(ఎం)
ఆత్మకూరు(ఎం), పల్లెర్ల, పారుపల్లి (బీసీ మహిళ)
కప్రాయిపల్లి, రాయిపల్లి, (ఎస్సీ జనరల్)
కొరటికల్, సింగారం, (మహిళ జనరల్)
లింగరాజుపల్లి, మోదుగుబావిగూడెం, మోదుగుకుంట, సారగండ్లగూడెం, సర్వేపల్లి, ఉప్పలపహడ్ (జనరల్)
మొర్పిరాల, కొరటికల్, రహీంఖానపేట, పల్లెపహడ్ (మహిళ జనరల్),
కూరెళ్ల, తుక్కాపురం, (ఎస్సీ మహిళ),
పోతిరెడ్డిపల్లి, పుల్లాయిగూడెం, రాఘవాపురం, టి.రేపాక, (బీసీ జనరల్),
==============================
భూదానపోచంపల్లి
జనరల్ : శివారెడ్డిగూడెం, పెద్దరావులపల్లి, దేశముఖి, అంతమ్మగూడెం, మేయర్‌నగర్, ధర్మారెడ్డిపల్లి
జనరల్ మహిళ: పెద్దగూడెం, రామలింగంపల్లి, దంతూరు, జిబిలక్‌పల్లి, ఖప్రాయపల్లి
బీసీ జనరల్: జూలూరు, దోతిగూడెం, గోసుకొండ, బీసీ మహిళా స్థానాలు బీమనపల్లి, జగతపల్లి
ఎస్సీ జనరల్: జలాల్‌పూర్, వంకమామిడి, ఎస్సీ మహిళా స్థానాలు కనుముకుల, పిలాయిపల్లి
ఎస్టీ జనరల్ : ఇంద్రియాల
==============================
భువనగిరి మండలం
34 గ్రామ పంచాయతీలకు 17 జనరల్, 9 బీసీలకు , 6 ఎస్సీలకు , 2స్థానాలు ఎస్టీలకు పోటీ చేసేందుకు రిజర్వేషన్లు ఖరారు చేశారు.
జనరల్: ఆకుతోటబావి తండా, బీయనతిమ్మాపూర్, జమ్మాపూర్, ముత్తిరెడ్డిగూడెం, నాగిరెడ్డిపల్లి, సిరివేణికుంట, బాలంపల్లి, బస్వాపూర్, పెంచికల్ పహాడ్
జనరల్ మహిళ: బొల్లేపల్లి, కేసారం, నందనం, వడాయిగూడెం, తాజ్‌పూర్, సూరేపల్లి, రెడ్డినాయక్ తండా, రామచంద్రాపురం
ఎస్టీ జనరల్: అనాజీపురం, పచ్చర్లబోర్డు తండా
ఎస్సీ మహిళ: అనంతారం, గంగసానిపల్లి, ముస్య్తాలపల్లి
ఎస్సీ జనరల్: తుక్కాపురం, చీమలకొండూరు
బీసీ జనరల్: ఎర్రంబెల్లి, వీరవెల్లి, నమాతపల్లి, గౌస్‌నగర్, బండసోమారం
బీసీ మహిళ హన్మాపురం, వడపర్తి, మన్నెవారిపంపు, చందుపట్ల
===============================
బొమ్మలరామారం
ఎస్టీ : బోయినపల్లి (జనరల్), మునీరాబాద్ (జనరల్), తిమ్మపురం (జనరల్), యావాపూర్‌తండా (మహిళ), గోవిందతండా (జనరల్), కంచల్‌తండా (మహిళ), కండ్లకుంట తండా (మహిళ), లక్ష్మీతండ (జనరల్), మైలారం కింది తండా (మహిళ), పిల్లిగుండతండా (జనరల్), రామస్వామితండా (మహిళ).
ఎస్సీ : హాజీపూర్ (జనరల్), జలాల్‌పురం (మహిళ), మర్యాల (జనరల్), మేడిపల్లి (మహిళ), రాంలింగంపల్లి (జనరల్).
బీసీ : మల్యాల ( మహిళ), చౌదరిపల్లి (జనరల్), తూంకుంట (జనరల్), రంగాపురం (మహిళ), కాజీపేట (జనరల్).
ఓసీ : ప్యారారం (మహిళ), సోలిపేట (మహిళ), మైసిరెడ్డిపల్లి (జనరల్), బండకాడిపల్లి (జనరల్), మాచనల్‌పల్లి (జనరల్), తిర్మలగిరి (మహిళ), నాయకునితండ (జనరల్), బొమ్మలరామారం (మహిళ), చీకటిమామిడి (జనరల్), ఫక్కీర్‌గూడెం (మహిళ), మైలారం (జనరల్), నాగినేనిపల్లి (మహిళ), పెద్దపర్వతాపూరం (మహిళ), వాలుతండా (జనరల్).
==================================
సంస్థాన నారాయణపురం
ఎస్టీ జనరల్: డాకుతండ, గంగమూలతండ, కడపగండితండ, పల్లగట్టుతండ, తుంబాయితండ, మర్రిబావితండ
ఎస్టీ మహిళ: బోటిమీదితండ, కొర్రతండ, రాధానగరండ, వెంకంబావితండ, వాచ్యతండ, రాచకొండ.
ఎస్సీ జనరల్: చిల్లాపురం, మహ్మదాబాద్
ఎస్సీ మహిళ: గుజ్జ; కోతులాపురం.
బీసీ జనరల్: కొత్తగూడెం, చిమిర్యాల.
బీసీ మహిళ: సంస్థాన నారాయణపురం, అల్లందేవిచెర్వు
జనరల్: జనగాం, గుడిమల్కాపురం, కంకణాలగూడెం, లచ్చమ్మగూడెం, మల్లారెడ్డిగూడెం, పొర్లగడ్డతండ
జనరల్ మహిళ: సర్వేల్, లింగవారిగూడెం, కడీలబావితండ, పుట్టపాక, వావిళ్లపల్లి
====================================
చౌటుప్పల్
జనరల్: కైతాపురం, ఎల్లగిరి, అంకిరెడ్డిగూడెం, చింతల గూడెం, కుంట్లగూడెం, మసీద్ గూడెం, ఎస్ లింగోటం
జనరల్ మహిళ: ఆరేగూడెం, అల్లాపురం, ఎల్లంబావి, జైకేసారం, నేలపట్ల, తూఫ్రానపేట
బీసీ జనరల్: గుండ్లబావి, చిన్న కొండూరు, మల్కాపురం, మందోళ్లగూడెం
బీసీ మహిళ: కొయ్యలగూడెం, పీపల్ పహాడ్, దేవలమ్మనాగారం, పెద్ద కొండూరు,
ఎస్సీ జనరల్: దామెర, దర్మోజిగూడెం,
ఎస్సీ మహిళ: కాట్రేవు, పంతంగి, ఎస్టీ స్థానాలు ఎనగంటి తండా
===================================
మోత్కూరు
ఎస్సీ మహిళ: పనకబండ,
ఎస్సీ జనరల్: పొడిచేడు, బీసీ జనరల్ సదర్శాపురం, అనాజిపురం,
బీసీ మహిళ: దాచారం,
జనరల్: ముశిపట్ల, దత్తప్పగూడెం, పాలడుగు,
జనరల్ మహిళ: పాటిమట్ల, రాగిబావి పది గ్రామపంచాయతీల్లో మొత్తం 88 వార్డులు ఉండగా 20 వార్డులు ఎస్సీ, 24 వార్డులు బీసీ, 44 వార్డులు జనరల్ స్థానాలుగా రిజర్వు అయ్యాయి. అందులో సగం మహిళలకు రిజర్వు అయ్యాయి.
===================================
రాజాపేట
23గ్రామ పంచాయతీల్లో 6బీసీలకు, జనరల్11, ఎస్సీ5, ఎస్టీ 1లకు కేటాయించారు
జనరల్ మహిళ: బసంతాపూర్, కాల్వపల్లి, సోమారం, నర్సాపూర్, కొత్తజాల
బిసి మహిళ: బేగంపేట, సింగారం, చల్లూరు
జనరల్: బూరుగుపలి, లక్ష్మక్కపల్లి, మల్లగూడెం, కొండ్రెడిచెరువు, నెమిల(జనరల్), రఘునాధపూర్,
బీసీ జనరల్: బొందుగుల, పాముకుంట, రేణికుంట
ఎస్సీ జనరల్: దూదివెంకటాపూర్, కుర్రారం, రాజాపేట
ఎస్సీ మహిళ: జాల, పారుపల్లి
ఎస్టీ జనరల్: పుట్టగూడెం
===================================
రామన్నపేట
బీసీ జనరల్: తుమ్మలగూడెం, మునిపంపుల, కుంకుడపాముల, ఉత్తటూర్
జనరల్: బోగారం, రామన్నపేట టౌన, కొమ్మాయిగూడెం, సర్నేనిగూడెం, నీర్నేంల, పల్లివాడ
జనరల్ మహిళ: సిరిపురం, ఎన్నారం, తుర్కపల్లి, ఇస్కిళ్ల, కొత్తగూడెం
ఎస్సీ మహిళ: బాచప్పల, నిదానపల్లి
బిసి మహిళ: వెల్లంకి, లక్ష్మాపురం, కక్కిరేణి, జనంపల్లి
ఎస్సీ జనరల్: శోభనాద్రిపురం, దుబ్బాక, సూరారం
===================================
తుర్కపల్లి
ఎస్సీ జనరల్: దత్తాయపలి,్ల మల్కాపూర్, పల్లెపహాడ్
ఎస్టీ: దయ్యంబండ(జనరల్), గొల్లగూడె(జనరల్), ముల్కలపల్లి(మహిళ), బాబుల్‌నాయక్ తండ(మహిళా), బద్దుతండ(మహిళ), బీల్యానాయక్ తండ(జనరల్), గుజ్జవానికుంట తండ(జనరల్), జేతురాం తండ(జనరల్), మోతీరాం తండ(మహిళా), పెద్దతండ(మహిళా), రామోజీనాయక్ తండ(జనరల్), చోక్లతండ(జనరల్)
బీసీలు: తిరుమలాపూర్(మహిళ), వెంకటాపూర్(మహిళ), ఇందిరానగర్(మహిళ), తుర్కపల్లి(జనరల్), మాధాపూర్(జనరల్), వేలుపల్లి(జనరల్)
జనరల్: దర్మారం (మహిళ), గందమల్ల, గోపాలపూర్, కోనాపూర్, కొండాపూర్(మహిళ), నాగాయపల్లి(మహిళ), వాసాలమర్రి (మహిళ), వీరారెడ్డిపల్లి (మహిళ), రుస్తాపూర్, ఇబ్రహీంపూర్(మహిళ), చిన్నలక్ష్మాపూర్(మహిళ), రాంపూర్ తండ
========================================
వలిగొండ
ఎస్సీ జనరల్: అరూరు, దాసిరెడ్డిగూడెం, గోపరాజుపల్లి, ప్రొద్దటూరు
ఎస్సీ మహిళ: చిత్తాపురం, నెమలికాల్వ, పుల్లిగిల్ల
బీసీ మహిళ: నర్సాపురం, నాగారం, గొల్నెపల్లి, సంగెం, జాలుకాలువ
బీసీ జనరల్: మునగాల తుర్కపల్లి, వేములకొండ, గురునాథ్‌పల్లి, కేర్చిపల్లి, రెడ్లరేపాక, మొగిలిపాక
జనరల్: ఎదుళ్ళగూడెం, అక్కంపల్లి, దుపెల్లి, గోకారం, జంగారెడ్డిపల్లి, కంచనపల్లి, లింగరాజుపల్లి, లోతుకుంట , నర్సయ్యగూడెం, వలిగొండ
జనరల్ మహిళ: మాందాపురం, పహిల్వానపురం, వర్కట్‌పల్లి, టేకులసోమారం, ముద్దాపురం, నాతాళ్ళగూడెం, సుంకిశాల, వెలువర్తి, వెంకటాపురం