మాతృ, శిశు మరణాలను తగ్గించడానికి కృషి
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:44 AM
మాతృ, శిశు మరణాలను తగ్గించడానికి జిల్లా యంతాంగం ఎంతో కృషి చేస్తోందని చైల్డ్ ఇమ్యూనైజేషన్ పోగ్రాం అధికారి రామకృష్ణ తెలిపారు.

చైల్డ్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాం అధికారి రామకృష్ణ
యాదగిరిగుట్ట రూరల, ఏప్రిల్ 10, (ఆంధ్రజ్యోతి): మాతృ, శిశు మరణాలను తగ్గించడానికి జిల్లా యంతాంగం ఎంతో కృషి చేస్తోందని చైల్డ్ ఇమ్యూనైజేషన్ పోగ్రాం అధికారి రామకృష్ణ తెలిపారు. గురువారం మండలలోని పెద్దకందుకూర్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడా పక్షోత్సవాల్లో భాగంగా ఉమెన్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లీబిడ్డల పోషణ, ఆరోగ్య సంరక్షణ, గర్భిణులు, ిపిల్లలకు టీకాలు, చేతుల పరిశుభ్రత సదస్సులో వివరించారు. కార్యక్రమంలో వసంతకుమారి, హెచ్‌ఈ సత్యనారాయణ, నర్సింహ, ప్రసాద్, కవిత, సీడీపీవో పాల్గొన్నారు.