మార్కెట్ యార్డుల అభివృద్ధికి కృషి
ABN , Publish Date - May 28 , 2025 | 12:16 AM
మార్కెట్ యార్డుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ సంచాలకులు జీ లక్ష్మీబాయి తెలిపారు. మంగళవారం హుజూర్‌నగర్, నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డులను ఆమె పరిశీలించారు.
రాష్ట్ర మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి
హుజూర్‌నగర్, నేరేడుచర్ల, మే 27 (ఆంధ్రజ్యో తి): మార్కెట్ యార్డుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ సంచాలకులు జీ లక్ష్మీబాయి తెలిపారు. మంగళవారం హుజూర్‌నగర్, నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డులను ఆమె పరిశీలించారు. ఇటీవల హుజూర్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన రాధిక ఆధ్వర్యంలో మార్కె ట్ యార్డ్‌ను అభివృద్ధి చేయాలని, అదేవిధంగా నేరేడుచర్ల మార్కెట్‌ను అభివృద్ధి చేయాలని మార్కెట్ పాలకవర్గ సభ్యులు ఈ నెల 25వ తేదీన మంత్రు లు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమారెడ్డిలను, ఎమ్మెల్యే పద్మావతిని కలిసి ప్రతిపాదన చేసిన నేపథ్యంలో హుజూర్‌నగర్, నేరేడుచర్ల మార్కెట్లను లక్ష్మీబాయి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రతిపాదించిన వివరాలను మార్కెట్ కమిటీల పాలకవర్గాలను అడిగి తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన అత్యవసర పనులను గుర్తిస్తున్నట్లు తెలిపారు. పనుల నివేదికను తయారు చేసి మంత్రులకు అందజేస్తామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో మార్కెటింగ్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్, సూపరింటెండెంట్ ఇంజనీర్ లక్ష్మణ్, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు రవీందర్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి నాగేంద్రశర్మ, మార్కెట్ చైర్మన్లు బెల్లంకొండ విజయలక్ష్మి, రాధికాఅరుణకుమార్, తాళ్ల సురే్‌షరెడ్డి, మార్కెట్ కార్యదర్శి సన్ని, వరంగల్ మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ ఉప్పల శ్రీనివాస్, నల్లగొండ డీఈ రవీందర్‌రెడ్డి, నాగేశ్వరశర్మ, నవీన్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు.