Share News

గృహజ్యోతి పైభానుడి ఎఫెక్ట్‌

ABN , Publish Date - May 25 , 2025 | 12:27 AM

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగం ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత విద్యుత్‌ గృహజ్యోతి పథకం ఎంతో మందికి లబ్ధిచేకూర్చింది. కొద్దికాలంలోని ఈ పథకం ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిం ది.

గృహజ్యోతి పైభానుడి ఎఫెక్ట్‌

చేజారిన ఉచిత రాయితీ

పెరిగిన విద్యుత్‌ వినియోగం

200 యూనిట్ల పరిమితి దాటుతున్న యూనిట్లు

(ఆంధ్రజ్యోతి, నల్లగొండ టౌన్‌) :ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగం ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత విద్యుత్‌ గృహజ్యోతి పథకం ఎంతో మందికి లబ్ధిచేకూర్చింది. కొద్దికాలంలోని ఈ పథకం ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిం ది. అయితే భానుడి ప్రభావంతో వేలాది మంది వినియోగదారులు గడిచిన రెండు నెల ల్లో ఈ పథకానికి దూరమయ్యారు. రోజురోజుకూ పెరుగుతున్న ఎండ తీవ్రతకు విద్యుత్‌ వినియోగం పెరిగి మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. పరిమితికి మించి విద్యుత్‌ వినియోగం అవుతుండడంతో పలువురు ఉచిత విద్యుత్‌ను అందుకోలేకపోతున్నారు. 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే వారికి మాత్రమే గృహజ్యోతి వర్తింపజేస్తుండగా, ఈ వేసవిలో వేలాది మంది అంతకు మించి వినియోగించడంతో బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. దీంతో వారిపై అదనపు భారం పడుతోంది. మార్చి నుంచి ఎండ ల ప్రభావం ఉండడంతో వినియోగదారులు ఈ పథకం నుంచి ఒక్కొక్కరూ దూరమవుతూ బిల్లులు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

గడిచిన రెండు నెలలుగా జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఫిబ్రవరి నుంచే పగటి ఉష్ణోగ్రతలు పెరగ్గా, మార్చిలో 40 డిగ్రీల మార్కు దాటింది. ఏప్రిల్‌, మే నెలల్లో 41 నుంచి 42 డిగ్రీ ల వరకు ఎండలు పెరిగాయి. దీంతో జనం ఇళ్ల కే పరిమితమవుతున్నారు. ఫలితంగా కూలర్లు, ఫ్రిజ్‌ల వినియోగం పెరగడంతో విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరిగి విద్యుత్‌ మీటర్‌ రీడింగ్‌ 200 యూనిట్లు దాటుతోంది. దీనికి తోడు పిల్లలకు వేసవి సెలవులు రావడంతో వారు టీవీలకే అతుక్కుపోతున్నారు. ఈ ప్రభావం కూడా గృహ జ్యోతిపై పడినట్లు తెలుస్తోంది. ఇంట్లో టీవీ, ఫ్రిజ్‌, బలుబ్బులు, ఫ్యాన్లు ఉంటే సాధారణంగా 120 నుంచి 150 వరకు యూనిట్ల విద్యుత్‌ వినియోగం అవుతుంది. మార్చి నుంచి ఈ వినియోగం పెరిగింది. 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లకు వినియోగం పెరగ్గా, ఏప్రిల్‌, మే నెలలో అది కాస్త 200ల యూనిట్లకు పైగా రీడింగ్‌ నమోదువుతోంది. జిల్లాలో రెండు నెలలుగా 20వేల మందికిపైగా వినియోగదారులు ఉచిత విద్యుత్‌కు దూరమయ్యారు. 1,200 యూనిట్లు దాటిన వారికి రూ.వెయ్యికి పైగా బిల్లు వస్తోంది.

జిల్లాలో ఇది పరిస్థితి

జిల్లాలో వివిధ కేటగిరీలకు సంబంధించి 8,18,696 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 4,91,650 గృహ వినియోగదారులు, 71,548 వాణిజ్య వినియోగదారులు, పరిశ్రమలకు సంబంధించి 4,556, చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి 2,227, వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు 2,36,179, వీధి దీపాలకు సంబంధించి 9,869, పాఠశాలలు, గుడులు, మసీదులు, చర్చీలకు సంబంధించి 2,667 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. అయితే కేటగిరీ-1లో ఉన్న గృహవిద్యుత్‌ వినియోగదారులకు సంబంధించి యూని ట్‌ ధర 1 నుంచి 50 యూనిట్ల వరకు రూ.1.95, 51-100 యూనిట్ల వరకు రూ.3.10, 101-200 యూనిట్ల వరకు రూ.4.80, 200 యూనిట్లు దాటితే రూ.5.10 వరకు యూనిట్‌ ధర ఉంది. 250-300 వరకు రూ.7.70, 301-400 వరకు రూ.9, 401-800 యూనిట్ల వరకు రూ.9.50, 800 యూనిట్లకుపైగా ఉంటే రూ.10 చొప్పున బిల్లులు చెల్లించాలి. ఈ లెక్కన 200 యూనిట్లు దాటిన వారు రూ.1,200 వరకు నెలవారీ విద్యుత్‌ బిల్లు చెల్లించాల్సి వస్తోంది.

20 వేల మందికిపైగా పథకానికి దూరం

వివిధ కేటగిరీలకు సంబంధించి జిల్లాలో మొ త్తం 8,18,687 కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో కేటగిరీ-1 గృహ వినియోగం పరిధిలోకి వస్తుంది. అందులో 4,91,650 కనెక్షన్లు ఉండగా, గృహజ్యోతికి సంబంధించి 2,38,000 కనెక్షన్‌లు, వీటిలో 2,28,907 మంది వినియోగదారులకు ఉచిత విద్యుత్‌ వర్తిస్తుంది. ఏప్రిల్‌ నెలలో 200 యూనిట్లలోపు వినియోగించిన 2,18,910 మందికి మాత్రమే పథకం వర్తించింది. ఆపై యూనిట్లు పెరిగిన సుమారు పదివేలకు పైగా వినియోగదారులు ఈ పథకానికి దూరమయ్యారు.. అయి తే జనవరిలో 2,24,507 మంది లభ్ధీపొంది 4400 మంది పధకానికి దూరమయ్యారు. అదేవిధంగా ఫిబ్రవరిలో 2,24,307 మంది లబ్దిపొంది 4200 దూరమయ్యారు. ఇక మార్చిలో 2,24,907 మంది లబ్దిపొంది 4వేల మంది పథకానికి దూరమయ్యారు. ఏప్రిల్‌ లో 2,18,910 మందికి వర్తించింది. 10 వేల మందికిపైగా దూరమయ్యారు. ఇక మే నెలలో కూడా 11200 వేలకు పైగా మంది లబ్దిదారులు గృహజ్యోతికి దూరం కాగా 2,17,707 మంది వినియోగదారులు లభ్దిపొందినట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఎండల తీవ్రత కారణంగా జిల్లాలో 21 వేల మందికి పైగా లబ్దిదారులకు ఏప్రిల్‌, మే నెలలో ఈ పథకం వర్తించకుండా పోయింది. నిర్దేశిత యూనిట్లు దాటిన వారికి నెలకు రూ. వెయ్యి నుంచి రూ. 1200 వరకు బిల్లు వస్తుంది.

200 యూనిట్లు దాటితే వర్తించదు : ఏ. వెంకటేశ్వర్లు , ఎస్‌ఈ, నల్లగొండ.

ఎండల తీవ్రత కారణంగా విద్యుత్‌ వినియోగం పెరిగింది. జిల్లాలో మొత్తం 2,28907మందికి గృహజ్యోతి పథకం వర్తించగా, ఏప్రిల్‌ నెలకు సంబందించి 2,18,910 మంది వినియోగదారులకు మాత్ర మే వర్తించింది. అయితే పధకానికి శాశ్వతంగా పధకానికి దూరం కారు. తిరిగి 200 యూనిట్ల లోపు వాడుకుంటే యఽథావిధి ఉచిత విద్యుత్‌ రాయితీ లభిస్తుంది.

Updated Date - May 25 , 2025 | 12:27 AM