విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:41 AM
దవాఖానా లో గత నెలలో జరిగిన ప్రసవాలు ఎన్ని?, అందులో సాధారణ ప్రసవాలు ఎన్ని? అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మహేశ్వరి అనే బాలింతతో కలెక్టర్ మాట్లాడి తల్లీ, బిడ్డల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ హనుమంతరావు
బీబీనగర్, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): దవాఖానా లో గత నెలలో జరిగిన ప్రసవాలు ఎన్ని?, అందులో సాధారణ ప్రసవాలు ఎన్ని? అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మహేశ్వరి అనే బాలింతతో కలెక్టర్ మాట్లాడి తల్లీ, బిడ్డల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన పనితీరును పరిశీలించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదవాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేసి తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించే విధంగా అవగాహన కల్పించాలన్నారు.
జిల్లా వైద్య కళాశాలలో ఖాళీ పోస్టుల భర్తీ
భువనగిరి (కలెక్టరేట్), ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 56 పోస్టులను అవుట్‌సోర్సింగ్ పద్ధతిన భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఒక ప్రటకనలో తెలిపారు. ఎంప్లాయిమెంట్ అసిస్టెంట్ మిషన్ (టీమ్) కార్యదర్శి శాంతిశ్రీ ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలను వెల్లడించారని వివరించారు. నిర్దేశించిన పోస్టులను మెరిట్, రోస్టర్ అర్హతలనుబట్టి భర్తీ చేయనున్నట్లు వివరించారు. 18 నుంచి 44 ఏళ్లవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫాం డౌన్‌లోడ్ చేసుకొని ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు 2వ తేదీలోగా జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలోని టీమ్ సెక్షన్‌లో సమర్పించాలన్నారు. గతంలో ప్రజావాణి, టీం ఆఫీస్, ఉపాధి కల్పన కార్యాలయంలో దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు కూడా తిరిగి చేసుకోవాలని సూచించారు.
పోస్టు పేరు సంఖ్య
ఈసీజీ టెక్నీషియన్ 4
ల్యాబ్ అటెండెంట్ 7
రేడియోగ్రఫిక్
టెక్నీషియన్ 4
ఓటీ టెక్నీషియన్ 4
అనస్తీషియా
టెక్నీషియన్ 2
గ్యాస్ ఆపరేటర్ 4
థియేటర్ అసిస్టెంట్ 2
డేటాఎంట్రీ ఆపరేటర్ 7
ఆఫీస్ సబార్డినేట్ 6
సీటీ టెక్నీషియన్ 4
ఎలక్ట్రీషియన్ 3
ప్లంబర్ 2
బ్లడ్ బ్యాంక్
టెక్నీషియన్ 3
రికార్డ్ అసిస్టెంట్ 1
కార్పెంటర్ 1