Share News

ఉచిత విద్య, వైద్యం అందించే దమ్ముందా?

ABN , Publish Date - Jun 23 , 2025 | 12:03 AM

దేశంలో ఉచిత విద్య, వైద్యం అందించే దమ్ము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా? అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ ప్రశ్నించారు. మండలంలోని పులిగిల్ల గ్రామంలో వేముల మహేందర్‌ నాలుగో వర్ధంతి సభలో పాల్గొని మాట్లాడారు. సీపీఎం అధికారంలో ఉన్న కేరళ రాష్ట్రంలో ఉచిత వైద్యం, విద్య అందిస్తుందన్నారు.

ఉచిత విద్య, వైద్యం అందించే దమ్ముందా?

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

వలిగొండ, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఉచిత విద్య, వైద్యం అందించే దమ్ము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా? అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ ప్రశ్నించారు. మండలంలోని పులిగిల్ల గ్రామంలో వేముల మహేందర్‌ నాలుగో వర్ధంతి సభలో పాల్గొని మాట్లాడారు. సీపీఎం అధికారంలో ఉన్న కేరళ రాష్ట్రంలో ఉచిత వైద్యం, విద్య అందిస్తుందన్నారు. దేశంలో బీజేపీ ప్రభు త్వం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యాన్ని అం దించలేరా? అని ప్రశ్నించారు. దేశంలో, రాష్ట్రంలో పేదలు, వ్యవసాయ కార్మికులు, మధ్యతరగతి ప్రజలు విద్యావైద్యానికి వారి సంపాదనలో 85శాతం ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో వారు అప్పులుచేసి విద్య, వైద్యాన్ని పొం దాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ప్రభుత్వం విద్య, వైద్యాన్ని నా మమాత్రంగా అమలు చేస్తూ ప్రైవేట్‌, కార్పొరేట్‌ శక్తులకు సహకరిస్తోందన్నారు. పేదలు నాణ్యమైన విద్యను, వైద్యాన్ని ఎందుకు అందుకోలేకపోతున్నారో?, దీనికి కారకులు ఎవరో?, సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశానికి స్వా తం త్య్రం వచ్చిన నాటినుంచి కాంగ్రెస్‌, బీజేపీ పరిపాలించాయన్నా రు. ఎన్ని ప్రభుత్వాలు మారినా పాలకులు మారడం తప్పా పేదలు, కూలీలు, వ్యవసాయ కార్మికులు, రైతుల సమస్యలు పరిష్కారం కావడంలేదని, వారంతా ప్రజల్ని ఓటేసే యంత్రాలుగా చూస్తున్నారన్నారు. ప్రజలు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. వేముల మహేందర్‌ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జహంగీర్‌, గ్రామ శాఖ కార్యదర్శి బుగ్గ చంద్రమౌళి, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మా టూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, జిల్లా కమిటీ సభ్యులు రాజయ్య, గణపతిరెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, వెంకట్‌రెడ్డి, సురేందర్‌, వెంకటేశంపాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2025 | 12:03 AM