Share News

సాగునీటి సరఫరాలో ఇబ్బందులు రావద్దు

ABN , Publish Date - Mar 11 , 2025 | 01:12 AM

సాగునీటిని సరఫరాలో ఇబ్బందులు రాకుం డా చూడాలని, చివరి ఆయకట్టు వరకు నీటిని అందించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

సాగునీటి సరఫరాలో ఇబ్బందులు రావద్దు

మంత్రులు ఉత్తమ్‌, తుమ్మల

భువనగిరి (కలెక్టరేట్‌), మార్చి 10 (ఆంధ్రజ్యో తి): సాగునీటిని సరఫరాలో ఇబ్బందులు రాకుం డా చూడాలని, చివరి ఆయకట్టు వరకు నీటిని అందించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి సీఎస్‌ శాంతికుమారి, వ్యవసాయశాఖ డైరెక్టర్‌ గోపితో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వారు మాట్లాడారు. మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ నీటిపారుదలశాఖ, వ్యవసాయ, విద్యుత్‌శాఖలు సమన్వయంతో పని చేసి పంట ల సాగులో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పంటలు ఎండిపోకుం డా చూడాలన్నారు. మంత్రి తుమ్మల మాట్లాడు తూ, దేవాదుల ప్రాజెక్టు కింద అత్యధికంగా వరి సాగవుతోందని, ఎగువ భాగాన రైతులు కాల్వల్లో మోటార్లు ఏర్పాటుచేసుకున్నారన్నారు. దీంతో దిగువకు నీరు వెళ్లడం లేదన్నారు. చివరి ఆయకట్టు వరకు నీరందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ ఎం.హనుమంతరావు, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, గంగాధర్‌,డీఆర్‌డీవో నాగిరెడ్డి, అదన పు డీసీపీ లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

సాగునీటి సరఫరాపై శ్రద్ధ చూపాలి

జిల్లాలో సాగునీటి సరఫరాపై అధికారులు శ్రద్ధ చూపాలని, రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు అన్నా రు.సోమవారం అధికారులతో నిర్వహించిన స మావేశంలో ఆయన మాట్లాడుతూ, సాగుకు అవసరమైన విద్యుత్‌ సరఫరా, ప్రణాళిక ప్రకారం నీటిని వినియోగించుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 01:12 AM