Share News

జిల్లాకో ఇందిరా మహిళా శక్తి భవన్‌

ABN , Publish Date - May 03 , 2025 | 12:34 AM

ప్రభు త్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అందులో భాగంగా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)కు చేయూతనిచ్చేందుకు ఆర్టీసీకి అద్దె బస్సులు, పెట్రో ల్‌ బంకుల నిర్వహణ, తదితర పనులు అప్పగిస్తూ సహకారం అందిస్తోంది. అంతేగాకుండా భవిష్యత్‌లో మరిన్ని పథకాలు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

జిల్లాకో ఇందిరా మహిళా శక్తి భవన్‌

కలెక్టరేట్‌ ప్రాంగణంలో రూ.5కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభం

యాదాద్రి, మే 2(ఆంధ్రజ్యోతి): ప్రభు త్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అందులో భాగంగా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)కు చేయూతనిచ్చేందుకు ఆర్టీసీకి అద్దె బస్సులు, పెట్రో ల్‌ బంకుల నిర్వహణ, తదితర పనులు అప్పగిస్తూ సహకారం అందిస్తోంది. అంతేగాకుండా భవిష్యత్‌లో మరిన్ని పథకాలు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రధానంగా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) కార్యాలయాలను ఆర్థిక కార్యకలాపాల కేంద్రాలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవన్‌ పేరుతో జిల్లా సమాఖ్య కోసం కార్యాలయంతో పాటు శిక్షణసౌకర్యాలను కల్పించేలా చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో ఇప్పటికే 10 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో జిల్లా, మండల సమాఖ్యలు పెద్ద భవనాల్లో కొనసాగుతున్నాయి.

అన్ని సౌకర్యాలతో భవనాలు

కొత్తగా మరో 22 జిల్లాల్లో జిల్లా సమాఖ్య భవనాలను అన్ని సౌకర్యాలతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లోనూ ఈ భవనాలు నిర్మించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.5కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. కలెక్టరేట్‌ ప్రాంగణంలో అర ఎకరం స్థలంలో జిల్లా సమా ఖ్య, ఇందిరా మహిళా శక్తి భవనాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు భూమి ని చదును చేసి, పునాది పనులు చేపడుతున్నారు. ఈ కార్యాలయం పూర్తిగా మహిళలకు పలు రం గాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు ఎస్‌హెచ్‌జీ ఉత్పతుల మార్కెటింగ్‌, వర్క్‌షెడ్లు, వస్తువులు, వస్త్ర ప్రదర్శనలు, జీవనోపాధి ఆర్థిక వనరుల కేంద్రంగా వినియోగించనున్నారు. డీఆర్డీవోతోపాటు అదనపు డీఆర్డీవోలు, డీపీఎంలు, ఏపీసీఎంలు, సీసీలు, పరిపాలన సిబ్బంది, వీఏవోలు ఈ భవనం నుంచే కార్యకలాపాలు నిర్వహించనుండటంతో అన్ని సౌకర్యాలతో భవనాన్ని నిర్మించనున్నారు.

Updated Date - May 03 , 2025 | 12:34 AM