అసమ్మతి గళంతో కాంగ్రెస్‌లో దుమారం
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:36 AM
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అసమ్మతి గ ళం కాంగ్రె్‌సలో దుమారం రేపుతోంది. రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవి విషయంలో రోజుకో ఘటన తెరమీదకు వస్తోంది. తాజాగా ఈ నెల 10వ తేదీన ఒక టీ వీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క రాజగోపాల్‌రెడ్డి వాదనకు బలం చేకూర్చేలా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
మంత్రి పదవిపై అధిష్ఠానం హామీ ఇచ్చిందన్న డిప్యూటీ సీఎం
రాజగోపాల్‌రెడ్డిని విమర్శిస్తూ తెరమీదకు చల్లమల్ల కృష్టారెడ్డి
చల్లమల్లకు కాంగ్రె్‌సకు సంబంధం లేదని ప్రకటించిన యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు
ఆసక్తికరంగా మారుతోన్న రాజకీయం
(ఆంధ్రజ్యోతిప్రతినిధి-నల్లగొండ): మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అసమ్మతి గ ళం కాంగ్రె్‌సలో దుమారం రేపుతోంది. రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవి విషయంలో రోజుకో ఘటన తెరమీదకు వస్తోంది. తాజాగా ఈ నెల 10వ తేదీన ఒక టీ వీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క రాజగోపాల్‌రెడ్డి వాదనకు బలం చేకూర్చేలా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వాస్తవాలు చెప్పినందుకు ఆయనకు ధన్యవాదాలు అంటూ రాజగోపాల్‌రెడ్డి ఎక్స్ (ట్విటర్)లో ట్వీట్ చేయడంతో కాం గ్రె్‌సలో, రాజకీయపార్టీల్లో చర్చ మొదలైంది. మరోవైపు సోమవారం చల్లమల్ల కృష్ణారెడ్డి రాజగోపాల్‌రెడ్డిని విమర్శిస్తూ నల్లగొండ జిల్లా మర్రిగూడలో విలేకరుల సమావేశంలో మాట్లాడితే, ఆయనకు కాంగ్రె్‌సతో సం బంధమే లేదని యాదాద్రి భువనగిరి డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి ఖండించగా, సంస్థాన్‌నారాయణపురం మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు చల్లమల్లపై ఫైర్ అయ్యారు.
మంత్రి పదవి హామీ వాస్తవమే..
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డ్డి బీజేపీని వీడి కాంగ్రె్‌సలో చేరిన సమయంలో అధిష్ఠానవర్గం ఆయనకు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం కల్పిస్తామని మాట ఇచ్చిన మాట వాస్తవమని, ఆరోజు తాను ఆ సమావేశంలో ఉన్నానని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. ఈ నెల 10వ తేదీన ఒక టీవీఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బహిరంగపరిచారు. కేబినెట్ కూర్పు సమీకరణాల్లో ఆయనకు అవకాశం కల్పించలేకపోయామని భట్టి వివరించారు. భట్టి వ్యాఖ్యల నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి తాజాగా సోమవారం ఎక్స్‌వేదికగా ఽభట్టి వ్యాఖ్యలకు ధన్యవాదాలు తెలుపుతూ ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన వార్తను ట్యాగ్ చేశారు.
కాంగ్రెస్ నేతలపై తరచూ విమర్శలు
రాజగోపాల్‌రెడ్డి ఇటీవల తరచూ సీఎంపైనా, కాంగ్రెస్ నేతలపైనా నేరుగా విమర్శలకు దిగుతున్నారు. తనకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీని వీడి కాంగ్రె్‌సలో చేరిన సందర్భంతోపాటు, పార్లమెంట్ ఎన్నికల సమయంలో నూ భువనగిరి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా డిప్యూటీ సీఎం సైతం రాజగోపాల్ వాదనను బలపరిచేలా వ్యాఖ్యానించడంతో కాంగ్రె్‌సలో రాజగోపాల్ వాదనకు బలం చేకూరినట్లైందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. రాజగోపాల్‌రెడ్డి సోదరుడు, మంత్రి వెంకటరెడ్డి మాత్రం ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి విషయమై విలేకరులు ప్రశ్నించగా, అది తన పరిధిలోని అంశం కాదని, ఆవిషయమై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొనడం గమనార్హం. కాంగ్రెస్ కీలకనేతలు ఒక్కొక్కరుగా రాజగోపాల్‌రెడ్డి వాదనపై ఏదో రకంగా స్పందిస్తుండడం, ఈ చర్చ పతాకస్థాయికి చేరడంతో అధిష్ఠానం దీనికి ఎలా ముగింపు పలుకుతుందోనని కాంగ్రెస్ క్యాడర్ ఎదురుచూస్తోంది.
రాజగోపాల్‌పై విమర్శలతో తెరమీదకు చల్లమల్ల
తాజా పరిణామాల నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గానికి చెందిన చల్లమల్ల కృష్ణారెడ్డి సోమవారం మర్రిగూడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డిపై విమర్శలు చేయడం, వెంటనే కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆయనపై ప్రతివిమర్శలు చేయడంతో సోషల్‌మీడియాలో దుమారం చెలరేగింది. రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న ధ్యాస మునుగోడు అభివృద్ధిపై లేదని కృష్ణారెడ్డి విమర్శించారు. అంతేకాకుండా మంత్రి పదవి, కాంట్రాక్టు రాలేదని రాజగోపాల్‌రెడ్డి అసమ్మతి రాగం ఎత్తుకున్నారని పేర్కొంటూ కృష్ణారెడ్డి విమర్శించడాన్ని రాజగోపాల్‌రెడ్డి అనుచరులు, కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో ఖండించారు. చల్లమల్ల కృష్ణారెడ్డికి కాంగ్రె్‌సతో సంబంధం లేదని, అతను కాంగ్రె స్‌లో చేరానని చెప్పుకోవడాన్ని ఖండిస్తున్నామని యాదాద్రి భువనగిరి డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలో కొనసాగుతూ, రాజగోపాల్‌రెడ్డిని ఓడగొట్టేందుకు, కాంగ్రె్‌సను నష్టపరిచేందుకు తీవ్రంగా ప్రయత్నించారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మా జీమంత్రి జానారెడ్డిని చల్లమల్ల కృష్ణారెడ్డి అసభ్యంగా తిడుతున్నారని తిట్టారని, బ్లాక్‌మనీ కాపాడుకోవడానికే ఆయన కాంగ్రె్‌సలోకి రావాలని చూస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని పార్టీలోకి రానీయమని సంజీవరెడ్డి ప్రకటనలో తెలిపారు. మరోవైపు చల్లమల్ల విమర్శలను ఖండిస్తూ సంస్థాన్‌నారాయణపురం మండల కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎంతగానో కష్టపడిన రాజగోపాల్‌రెడ్డిని విమర్శించే నైతికస్థాయి కృష్ణారెడ్డికి లేదని, మరోసారి నోరు పారేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కోట్లాది రూపాయల సొంత నిధులతో ప్రజాసేవ చేస్తున్న రాజగోపాల్‌రెడ్డిని విమర్శించే స్థాయి కృష్ణారెడ్డికి లేదన్నారు. ఇంతగా నోరు పారేసుకుంటున్న కృష్ణారెడ్డి భువనగిరి లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎటు పోయారని నిలదీశారు. మొత్తంగా మునుగోడు నియోజకవర్గంలో మరోసారి రాజకీయం వేడెక్కుతుండడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.