10న బుద్ధవనంలో ధర్మచక్ర ప్రవర్తన దినోత్సవం
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:18 AM
అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రమైన నాగార్జునసాగర్ హిల్‌కాలనీలోని బుద్ధవనంలో ఈ నెల 10న గురుపౌర్ణమి సందర్భంగా ధర్మ్రపవర్తన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
నాగార్జునసాగర్, జూలై 3 (ఆంధ్రజ్యోతి) : అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రమైన నాగార్జునసాగర్ హిల్‌కాలనీలోని బుద్ధవనంలో ఈ నెల 10న గురుపౌర్ణమి సందర్భంగా ధర్మ్రపవర్తన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమం ముఖ్యఉద్దేశం సిద్ధార్థుడు మొదటిజ్ఞానోదయ సందేశ రోజు అన్నారు. తాను నేర్చకున్న సత్యాన్ని మొదటిసారిగా శిష్యులైన కొండన్న, మహనామా, పప్సా అప్పాజీ, బాధియాలకు మధ్యప్రదేశ రాష్ట్రం సారనాథ్ జింకల వనంలో తెలియజేసిన(ఉపన్యసించిన) రోజు బుద్ధుడి జీవితంలో ముఖ్యమైన ఐదు ఘట్టాలల్లో ఒకటన్నారు. బుద్ధుని మొదటి ఉపన్యాసాన్ని ధర్యచక్ర ప్రవర్తన దినోత్సవంగా బౌద్ధులు నిర్వహించుకుంటారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 10న ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.