Share News

హెచ్‌ఎండీఏ నిధులతో అభివృద్ధి పనులు

ABN , Publish Date - Jun 21 , 2025 | 12:15 AM

భువనగిరి నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులకు హెచ్‌ఎండీఏ ద్వారా రూ.56 కోట్ల నిధులు కేటాయించిన సీ ఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు అని భువనగిరి ఎమ్మె ల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు.

హెచ్‌ఎండీఏ నిధులతో అభివృద్ధి పనులు

భువనగిరి నియోజకవర్గం అభివృద్ధికి రూ.56 కోట్లు

ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

భూదాన్‌పోచంపల్లి, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): భువనగిరి నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులకు హెచ్‌ఎండీఏ ద్వారా రూ.56 కోట్ల నిధులు కేటాయించిన సీ ఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు అని భువనగిరి ఎమ్మె ల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భూదాన్‌పోచంపల్లి మునిసిపాలిటీకి రూ.7.9 కోట్లు, మండలానికి రూ.9.10కోట్లు హెచ్‌ఎండీఏ నిధులు కేటాయించగా, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడా రు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో నియోజకవర్గం మొత్తానికి రూ.12కోట్లు కేటాయించడం గగనమైందని, ప్రజాపాలన-ప్రగతిబాట కార్యక్రమం ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి ఈ నియోజకవర్గంలో నిధుల వరద పారించారని, దీంతో భువనగిరికి మహర్దశ కలుగనుందన్నారు. భువనగిరి నియోజకవర్గం పరిధిలో చేపట్టే హెచ్‌ఎండీఏ నిఽధుల అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమా న్ని భూదాన్‌పోచంపల్లి మండలం నుంచి ప్రారంభించుకుంటున్నట్లు తెలిపారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లో కేసీఆర్‌ మోసపూరిత మాటలతో కాలం గడిపారే తప్ప ఒక్క డబుల్‌బెడ్‌ రూం ఇల్లు ఇవ్వలేదన్నారు. మూసీ ప్రక్షాళన కోసం పాదయాత్ర చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిచ్చి అధిక నిధులు కేటాయించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తు న్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అందరూ అభినందించాలన్నా రు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ను గెలిపించుకుని అభివృద్ధికి బాటలు వేయాలన్నారు.

నేతన్నకు భరోసా, త్రిఫ్ట్‌ స్కీం కింద మంజూరైన రూ.81,63,200 చెక్కులను కార్మికులకు అందజేశారు. ప్రభుత్వం చేనేత రంగానికి చేయూతనిస్తూ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. హెచ్‌ఎండీఏ నిధులతోపాటు మంత్రి సీతక్క ద్వారా మరో రూ.40 కోట్ల నిధులతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు. అనంతరం పోచంపల్లి మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో చేనేత, జౌళీశాఖ ఏడీ శ్రీనివా్‌సరావు, హెచ్‌ఎండీఏ అధికారులు ఈఈ ధన్‌మోహన్‌, ఏఈ వెంకన్న, మున్సిపల్‌ కమిషనర్‌ అంజన్‌రెడ్డి, ఎంపీడీవో భాస్కర్‌, తహసీల్దారు పి.శ్రీనివా్‌సరెడ్డి, ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్రనేత తడక వెంకటేష్‌, మండల అధ్యక్షుడు పాక మల్లే్‌షయాదవ్‌, పట్టణ అధ్యక్షుడు భారత లవకుమార్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు కళ్లెం రాఘవరెడ్డి, జిల్లా నేతలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2025 | 12:15 AM