Share News

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

ABN , Publish Date - Aug 08 , 2025 | 11:57 PM

నాగార్జునసాగర్‌, ఆగస్టు8 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో చేప ట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి అన్నారు.

 అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

నాగార్జునసాగర్‌, ఆగస్టు8 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో చేప ట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి అన్నారు.సాగర్‌ హిల్‌కాలనీలో తన నివాసంలో శుక్రవారం తన తండ్రిమాజీ మంత్రి జానారెడ్డితో కలిసి పబ్లిక్‌హెల్త్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, విద్యుత్‌శాఖ, మిషన్‌ భగీరథ అధికారులు, కాంట్రాక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. వర్షకాలం నేపథ్యంలో గ్రా మాల్లో ఎక్కడ విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా చూడాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. అంతే కాకుండా గ్రామాల్లో, కృష్ణ పట్టె తండాల్లో లోవోల్టేజీ సమస్యలు రాకుండా అవసరమైన చోట ట్రాన్స్‌ఫార్మార్‌ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని ఎక్కడైన ఇంటింటికి నల్లాలు ఏర్పాటు చేయకపోతే వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. హాలియా, నందికొండ మునిసిపాలిటీల్లో కొనసాగుతున్న అమృత్‌ 2.0 పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. .వానాకాలం కావడంతో వీధుల్లో నీటి నిల్వలు ఉన్న చోట దోమలు ప్రబలకుండా ఎప్పటికప్పుడు బ్లీచింగ్‌ చల్లడం, ఆయిల్‌ బాల్స్‌ వేయడం వంటి పనులను చేపట్టాల్సిన పబ్లిక్‌ హెల్త్‌ అధికారులకు తెలిపారు. విష జ్వరాలు ప్రబల కుండా గ్రామాల్లో, తండాల్లో వీధులను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.

ఫ నందికొండలో రూ. 9 కోట్లతో అభివృద్ధి పనులు

నందికొండ మునిసిపాలిటీలో రూ. 9 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను కూడా త్వరలో ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ పనుల్లో ఫైలాన్‌ కాలనీలో ఫిల్లర్‌ వద్ద నుంచి జెన్‌కో కార్యాలయం వరకు డబుల్‌ రోడ్డు వేయడంతో పాటు డివైడర్‌ ఏర్పాటు చేసి సెంట్రల్‌ లైటింగ్‌ కో సం రూ. 8 కోట్లు అలాగే హిల్‌కాలనీ, ఫైలాన్‌ కాలనీల్లో అవసరమైన చోట సీసీ రోడ్ల నిర్మాణానికి మరో కోటి రూపాయాలు వాడుకోవాలని అఽధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌, మాజీ జడ్పీటీసీ కర్నాటి లింగరెడ్డి, ప్రాజెక్టు ఎస్‌ఈ మల్లికార్జున్‌రావు, పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, డీఈ మనోహర్‌, ఏఈ సురేష్‌, నందికొండ, హాలియామునిసిపల్‌ కమిషనర్లు గురులింగం, రామదుర్గ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 08 , 2025 | 11:57 PM