Share News

ఆదివాసీల అభివృద్ధి కాంగ్రె్‌సతోనే సాధ్యం

ABN , Publish Date - Jun 27 , 2025 | 12:16 AM

సూర్యాపేటటౌన, జూన 26(ఆంధ్రజ్యోతి): ఆదివాసీల అభివృద్ధి కాంగ్రె్‌సతోనే సాధ్యమని డోర్నకల్‌ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ రాంచందర్‌నాయక్‌ అన్నారు.

   ఆదివాసీల అభివృద్ధి కాంగ్రె్‌సతోనే సాధ్యం

సూర్యాపేటటౌన, జూన 26(ఆంధ్రజ్యోతి): ఆదివాసీల అభివృద్ధి కాంగ్రె్‌సతోనే సాధ్యమని డోర్నకల్‌ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ రాంచందర్‌నాయక్‌ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి హాస్టల్‌లో తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్‌ బునియాది కార్యకర్తల సమ్మేళనం ఉమ్మడి నల్లగొండ జిల్లా శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ భిన్నత్వంలో ఏకత్వాన్ని సృష్టిస్తే బీజేపీ ఏకత్వంలో భిన్నత్వాన్ని సృష్టిస్తుందని ఆరోపించారు. ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్‌ పార్టీనే అని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ ఆలోచన విధానాన్ని గ్రామాల్లోకి తీసుకుపోయే బాధ్యత అందరిపై ఉందన్నారు. కోదాడ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్‌పద్మావతిరెడ్డి మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం అంబానీ, ఆదానీకి కట్టబెడుతుందన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు విద్యా, వైద్య, ఉపాది, ఉద్యోగాలు ఇవ్వకుండా గొర్లు, బర్రెలు ఇచ్చారన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గిరిజనులను విస్మరించిన కేసీఆర్‌ నేడు అధికారంలో కోల్పో యి ఫాంహౌస్‌ కూర్చున్నాడన్నారు. రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యేవరకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందన్నారు. ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ దేశస్వాతంత్ర ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాల్లో ఆదివాసీ, గిరిజనుల పాత్ర ఎంతో గొప్పదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఇటీవల రూ. 200కోట్ల ఎస్టీ సబ్‌ప్లాన నిధులు విడుదల చేసిందన్నారు. రాష్ట్రంలో గిరిజనులు జనరల్‌ స్థానాల్లో 35 మంది ఎమ్మెల్యేలను గెలిపించారన్నారు. ట్రైకార్‌ చైర్మన బెల్లయ్యనాయక్‌ మాట్లాడుతూ ఎక్కడయితే గిరిజనులు గౌరవించబడుతారో అక్కడ రాజ్యం, నాయకులు సంతోషంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ కాం గ్రెస్‌ బునియాది శిక్షణ శిబిరం జాతీయ కో ఆర్డ్డినేటర్‌ రాహుల్‌బాల్‌, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన కొప్పుల వేణారెడ్డి, కాంగ్రెస్‌ ఎస్టీసెల్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ కోట్యానాయక్‌, అంజద్‌అలీ, యూత కాంగ్రెస్‌ జిల్లా అద్యక్షుడు ఎలిమినేటి అభినయ్‌, లింగంనాయక్‌, రాణాప్రతాప్‌, కృష్ణ, శ్రీను, మల్లికార్జున, మోహన, నాగునాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2025 | 12:16 AM