రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:26 AM
రాజకీయాలకు అతీతంగా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేద్దామని మునుగో డు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. సంస్థాన్‌నారాయణపురం మండలంలోని లచ్చమ్మగూడెం, చిమిర్యాల గ్రామాల్లో నిర్మించనున్న 33 కేవీ సబ్ స్టేషన్‌ల పనులకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
సంస్థాన్‌నారాయణపురం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రాజకీయాలకు అతీతంగా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేద్దామని మునుగో డు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. సంస్థాన్‌నారాయణపురం మండలంలోని లచ్చమ్మగూడెం, చిమిర్యాల గ్రామాల్లో నిర్మించనున్న 33 కేవీ సబ్ స్టేషన్‌ల పనులకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గవ్యాప్తంగా లోఓల్టేజీ సమస్య ఉందని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంకోసం మరో 10 సబ్‌స్టేషన్లకు ప్రతిపాదనలు పంపామన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ సాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ కుంభం శ్రీనివా్‌సరెడ్డి, ఆర్డీవో శేఖర్‌రెడ్డి, నాయకులు ఉమాదేవి ప్రేమ్‌చందర్‌రెడ్డి, భానుమతి వెంకటేశం, వాంకుడోత్ బుజ్జి, దోనూరు జైపాల్‌రెడ్డి, శ్రావణి, జక్కల ఐలయ్య, మందుగుల బాలకృష్ణ పాల్గొన్నారు.
చౌటుప్పల్ రూరల్: గిరిజన గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం ఎనగంటి తండాలో 33/11 కేవీ సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఆర్డీవో శేఖర్ రెడ్డి, మా ర్కెట్ కమిటీ చైర్మన్ వెంకటయ్య, నాయకులు బబ్బు రాజు గౌడ్, తాడూరి వెంకట్ రెడ్డి, చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, వెన్‌రెడ్డి రాజు, దేవేందర్, సుర్వి నర్సింహగౌడ్ పాల్గొన్నారు.