విద్యార్థుల్లో సైన్స దృక్పథం పెంపొందించాలి
ABN , Publish Date - Jul 19 , 2025 | 12:59 AM
ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీ, సైన్స ల్యాబ్, వర్చువల్ రియాలిటీ వంటి సౌకర్యాలను కల్పించి విద్యార్థుల్లో సైన్స దృక్పథం పెంపొందించేలా కృషి చేయాలని రాష్ట్ర విద్యా కమిషన చైర్మన ఆకునూరి మురళి ఉపాధ్యాయులకు సూచించారు.
రాష్ట్ర విద్యా కమిషన చైర్మన ఆకునూరి మురళి
బీబీనగర్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీ, సైన్స ల్యాబ్, వర్చువల్ రియాలిటీ వంటి సౌకర్యాలను కల్పించి విద్యార్థుల్లో సైన్స దృక్పథం పెంపొందించేలా కృషి చేయాలని రాష్ట్ర విద్యా కమిషన చైర్మన ఆకునూరి మురళి ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో జీసీఎనఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నెలకొల్పిన ఇంటిగ్రేటెడ్ లైబ్రరీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ పుట్టిన గడ్డ, చదువుకున్న పాఠశాలపై మమకారంతో ఇక్కడి విద్యార్థుల సౌకర్యార్థం స్థానిక ఎనఆర్‌ఐ పాఠశాలలో ఇంటిగ్రేటెడ్ లైబ్రరీని నెలకొల్పడం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయులు ఇక్కడి సైన్స ల్యాబ్‌ను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతికతపై ఆలోచనలు పెరిగేలా ప్రేరేపించి, వారితో సైన్స ప్రయోగాలను చేయించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు కమిషన చైర్మన ఎదుట సైన్స ప్రయోగాలు చేయగా తన సెల్‌ఫోనలో వీడియో తీసుకుని విద్యార్థులను అభినందించారు. ఆయన వెంట డీఈవో సత్యనారాయణ, తెలంగాణ డెవల్‌పమెంట్ ఫోరం ప్రతినిధులు గోనారెడ్డి, కీర్తిరెడ్డి, జీసీఎనఆర్ ట్రస్టు ప్రతినిధి అరుణ్‌కుమార్, హెచఎం బాలారెడ్డి పాల్గొన్నారు.