Share News

యాదగిరీశుడికి శాసో్త్రక్తంగా నిత్య పూజలు

ABN , Publish Date - Dec 28 , 2025 | 12:39 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి దివ్యక్షేత్రంలో శనివారం శాసో్త్రక్తంగా నిత్య పూజలు నిర్వహించారు.

యాదగిరీశుడికి శాసో్త్రక్తంగా నిత్య పూజలు
ఆండాళ్‌ అమ్మవారికి హారతులు నివేదిస్తున్న మహిళలు

యాదగిరిగుట్ట, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి దివ్యక్షేత్రంలో శనివారం శాసో్త్రక్తంగా నిత్య పూజలు నిర్వహించారు. సుదర్శన హోమం, నిత్య కల్యాణోత్సవం వైభవంగా చేపట్టారు.శివాలయంలో నిత్య రుద్రహవన పూజలు శైవాగమ పద్ధతిలో కొన సాగాయి. ఇష్టదైవాలను దర్శించుకునేందుకు శనివారం భక్తులు అధిక సంఖ్యలో యాదగిరి క్షేత్రానికి వచ్చారు. సుమారు 35 వేల మంది భక్తులు క్షేత్ర దర్శనానికి రాగా ప్రత్యేక, ధర్మదర్శన క్యూలైన్లు భక్తులతో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది. ప్రత్యేక దర్శనానికి అరగంట, ధర్మదర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.42.80లక్షల ఆదాయం సమకూరినట్లు ఈవో ఎస్‌. వెంకట్రావు తెలిపారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా 12వ పాశుర పఠనం గురించి ఆలయ ప్రధానార్చకుడు కాండూరి వెంకటాచార్యులు వివరించారు. ఆండాళ్‌ అమ్మవారికి హారతు లు నివేదించగా, అర్చకులు ప్రాకా ర మండపంలో సుదర్శన హోమం నిర్వహించారు. లక్ష్మీనృసింహుడిని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు (నేషనల్‌ గ్రీన ట్రిబ్యూనల్‌ సభ్యుడు) పుష్పసత్యనారాయణ, ఎం.దండపాణి సతీసమేతంగా వేర్వేరుగా దర్శించుకున్నారు.

నాగర్‌కర్నూల్‌లో లక్ష్మీనరసింహుడి కల్యాణం

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారి కల్యాణోత్సవం ఆలయ ప్రధానార్చకుడు కాండూరి వెంకటాచార్యులు బృందం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో సీతారామస్వామి ఆలయంలలో శనివారం ఏఈవో గజ్వేల్లి రఘు నేతృత్వంలో కల్యాణోత్సవం జరిగింది. శాసో్త్రక్తంగా స్వామిఅమ్మవారలు పరిణయమాడే శుభ ఘడియలను నేత్రపర్వంగా నిర్వహించారు. కల్యాణ మండపాన్ని పూలమాలలు, పచ్చని తోరణాలతో అలంకరించి వేద మంత్ర పఠనాలు, మంగళవాయిద్యాలు, భజన మండలి, మహిళల కోలాటాలు, భక్తుల కోలాహాలం నడుమ స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి దంపతులు స్వామివారికి పట్టువసా్త్రలు, తలంబ్రాలు తెచ్చారు. అనంతరం తీర్ధప్రసాదాల వితరణ, అన్నదాన కార్యక్రమం, భక్తుల పూజలు, ప్రసాదాల వితరణ చేయగా కల్యాణోత్సవంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన రమణరావు, ఏఈవో గజ్వేల్లి రఘు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 12:39 AM