Share News

లారీలు సమయానికి పంపకపోతే క్రిమినల్‌ కేసులు

ABN , Publish Date - May 24 , 2025 | 12:26 AM

లారీ కాంట్రాక్టర్లు తగినన్ని, సకాలం లో లారీలు పంపకపోతే వారికి ఇవ్వాల్సిన బిల్లులు పెండింగ్‌లో పెట్టడమే కాకుండా, క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్‌ హనుమంతరావు హెచ్చరించారు.

లారీలు సమయానికి పంపకపోతే క్రిమినల్‌ కేసులు

కలెక్టర్‌ హనుమంతరావు

భూదాన్‌పోచంపల్లి మండలంలో కలెక్టర్‌ సుడిగాలి పర్యటన

భూదాన్‌పోచంపల్లి, మే 23 (ఆంధ్రజ్యో తి): లారీ కాంట్రాక్టర్లు తగినన్ని, సకాలం లో లారీలు పంపకపోతే వారికి ఇవ్వాల్సిన బిల్లులు పెండింగ్‌లో పెట్టడమే కాకుండా, క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్‌ హనుమంతరావు హెచ్చరించారు. భూదాన్‌పోచంపల్లి మండలంలోని మండలంలోని జూలూరు, ముక్తాపూర్‌, శివారెడ్డిగూడెం, జిబ్లక్‌పల్లి, దంతూరు తదితర గ్రామాల్లోని పీఏసీఎస్‌, ఐకేపీ ధాన్యం కొనుగోలుకేంద్రాలను కలెక్టర్‌ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీఏసీఎస్‌ సెంటర్ల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సకాలంలో తగినంత మంది హమాలీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. హమాలీలను పెంచి త్వరగా కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. వర్షాలు వస్తున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి నష్టం రావద్దని ఆదేశించారు. జూలూరు కేంద్రంలో జాలిమిషన్‌ కొత్తగా కొనుగోలు చేసినా, రైతులకు అందుబాటులోకి తేనందుకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లాలో 2.50లక్షల మెట్రిక్‌ టన్నుల డబ్బులు రైతుల ఖాతాలో జమ అయ్యాయని కలెక్టర్‌ తెలిపారు. మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యానికి మద్దతు ధర డబ్బులు రైతులకు 48 గంటల్లో జమ చేస్తున్నామన్నారు. ఆయనవెంట జిల్లా మేనేజర్‌ హరికృష్ణ, డీఎ్‌సవో రోజా, డీటీడీఎస్‌ బాలమణి, తహసీల్దార్‌ పి.శ్రీనివా్‌సరెడ్డి, ఎంఆర్‌ఐ వెంకట్‌రెడ్డి, మండల వ్యవసాయాధికారి ఏ.శైలజ, ఐకేపీ ఏపీఎం నీరజ, ఏఈవో నరేష్‌, పీఏసీఎస్‌ సీఈవో బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2025 | 12:26 AM