Share News

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ వసతులు

ABN , Publish Date - Aug 16 , 2025 | 01:03 AM

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌స్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్కిటెక్ట్‌ మురళీతో కలిసి శుక్రవారం రాత్రి చౌటుప్పల్‌ పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల భవన సముదాయాన్ని రాజగోపాల్‌ రెడ్డి పరిశీలించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ వసతులు

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

చౌటుప్పల్‌ టౌన్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌స్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్కిటెక్ట్‌ మురళీతో కలిసి శుక్రవారం రాత్రి చౌటుప్పల్‌ పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల భవన సముదాయాన్ని రాజగోపాల్‌ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ మొదట మండల, మునిసిపల్‌ కేంద్రాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సర్వేచేసి టెన్‌ప్ల్‌సటూకు సరిపడే సదుపాయాలను అభివృద్ధి చేయాలని, పాఠశాల భవనాలను చూస్తే దేవాలయాలుగా ఉండాలన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా చౌటుప్పల్‌ మునిసిపాలిటీలో మూడు క్లస్టర్‌ పాఠశాలలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ ఆకుల ఇంద్రసేనారెడ్డి, కాంగ్రెస్‌ పట్టణ, మండల అధ్యక్షులు సుర్వి నర్సింహగౌడ్‌, బోయ దేవేందర్‌, మాజీ వైస్‌ ఎంపీపీలు బొంగు జంగయ్య, ఉప్పు భద్రయ్య, నాయకులు ఎండీ హన్నూబాయి, బాబా షరీఫ్‌, దేప రాజు, మల్లేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2025 | 01:03 AM