కాంగ్రెస్ నాయకుడు శ్యామ్ సుందర్‌రెడ్డి మృతి
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:55 AM
నూతనకల్, ఆగస్టు22(ఆంధ్రజ్యోతి) : కాంగ్రె స్ సీనియర్ నాయకుడు, సమితి మాజీ అధ్యక్షుడు జెన్నారెడ్డి శ్యామ్‌సుందర్‌రెడ్డి (95) గురువారం రాత్రి గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతి చెందారు.
నూతనకల్, ఆగస్టు22(ఆంధ్రజ్యోతి) : కాంగ్రె స్ సీనియర్ నాయకుడు, సమితి మాజీ అధ్యక్షుడు జెన్నారెడ్డి శ్యామ్‌సుందర్‌రెడ్డి (95) గురువారం రాత్రి గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతి చెందారు. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ బలోపేతానికి విశేష కృషి చేశారు. ఆయన మృతికి మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, రైతు కమిషన్ సభ్యుడు రాంరెడ్డి గోపాల్‌రెడ్డి. చెవిటి వెంకన్నయాదవ్, సూర్యాపేట, తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్లు కొప్పుల వేణారెడ్డి, తీగల గిరిధర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నా గం జయసుధాసుధాకర్‌రెడ్డి, సంతాపం తెలిపారు. శ్యామ్‌సుందర్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం ఎర్రపహాడ్‌లో నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి తెలిపారు.