Share News

కంటి వైద్యపరీక్షల నిర్వహణ అభినందనీయం

ABN , Publish Date - Oct 23 , 2025 | 12:32 AM

గ్రామీణ ప్రజలకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని, ఇలాంటి దాతలు ముందుకొచ్చి అనేక గ్రామాల్లో కంటిచూపును అందించాలని నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు.

కంటి వైద్యపరీక్షల నిర్వహణ అభినందనీయం
సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వీరేశం, వేదికపై కలెక్టర్‌ హనుమంతరావు, ఎస్పీ చక్రవర్తిరెడ్డి

రామన్నపేట, అక్టోబర్‌ 22 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రజలకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని, ఇలాంటి దాతలు ముందుకొచ్చి అనేక గ్రామాల్లో కంటిచూపును అందించాలని నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. మండలంలోని మునిపంపుల గ్రామంలో మాజీ సర్పంచ దేవిరెడ్డి రాంరెడ్డి జ్ఞాపకార్థం శంకర్‌ నేత్రాలయ కంటి ఆసుపత్రి డాక్టర్లతో మాజీ సర్పంచ దేవిరెడ్డి సావిత్రమ్మ వారి కుమారుడు వీరేందర్‌రెడ్డి ఆర్థిక సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మండలంలో సుమారుగా 14 గ్రామాలకు 8రోజుల పాటు నిర్వహించే ఉచిత కంటి పొర చికిత్స శిబిరం ప్రారంభోత్సవం భగత సింగ్‌ విజ్ఞాన కేంద్రంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యల్లో కంటిచూపు సమస్య ఒకటని అన్నారు. కనీసం వైద్యం చేయించుకోవడానికి గ్రామీణ ప్రజల దగ్గర డబ్బులు లేక, కనీస అవగాహన లేక కంటి చూపు మందగించి, దీర్ఘకాలికంగా ఇబ్బం ది పడుతున్నారన్నారు. మానవత్వంతో ఇలాంటి దాతలు ముందు కు రావడం అభినందనీయమని, ప్రజలందరూ ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మనోహర్‌, సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్పీ) గుమ్మి చక్రవర్తిరెడ్డి, నిర్వాహకులు దేవిరెడ్డి పద్మవీరేందర్‌రెడ్డి. టాస్క్‌ఫోర్స్‌ చైర్మన సింరిగిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి, ిపీడీ ఉపేందర్‌రెడ్డి, తహశీల్దార్‌ లాల్‌బహదూర్‌, ఎంపీడీవో రాములు, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన సింగిరెడ్డి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు గుమ్మి గోపీనాథ్‌రెడ్డి, వెంగల్‌రెడ్డి, వెంకటపాపిరెడ్డి, నర్మద, నిర్మల, అంజనమ్మ, శంకర్‌ నేత్రాలయ కోఆర్డినేటర్‌ భానుప్రకాష్‌, సభాధ్యక్షుడు తొలుపునూరి చంద్రశేఖర్‌, నిర్వాహకులు గాదె శోభారాణి, బొడ్డుపల్లి వెంకటేశం, గంటెపాక శివకుమార్‌, కట్ట యాదయ్య, మిర్యాల శ్యామ్‌సుందర్‌, మన్నెం పద్మారెడ్డి, తాళ్లపల్లి జితేందర్‌, ఉయ్యాల నర్సింహ, బాదె బిక్షం, జోగుల సాయికుమార్‌, ఉడుతల శ్రీనివాస్‌, చొల్లేటి ప్రభాకరాచారి, తొల్పునూరి భరత, బత్తిని సందీప్‌, తుర్కపల్లి నరేష్‌, బొడ్డు మహేష్‌, జంపాల మహేష్‌, ఉయ్యాల సాయి పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 12:32 AM