నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి
ABN , Publish Date - Aug 16 , 2025 | 01:04 AM
రాష్ట్రంలో కురిసిన వర్షాలతో నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని సీపీఐ జాతీ య సమితి సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు.
సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి
భువనగిరి గంజ్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కురిసిన వర్షాలతో నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని సీపీఐ జాతీ య సమితి సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. జిల్లాకేంద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయ ణ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాట కార్యక్రమాలు రూపొందించాలన్నారు. ఈ నెల 20 నుంచి 22 వరకు మల్కాజ్‌గిరి జిల్లా గాజులరామారంలో సీపీఐ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నామని, ప్రజలు, నాయకులు, కార్యకర్తలో అధిక సంఖ్యలో తరలిరావాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు గోద శ్రీరాములు, జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, సహాయ కార్యదర్శులు చేడే చంద్రయ్య, ఎండీ ఇమ్రాన్, ఏశాల అశోక్, కురిమిద్ద శ్రీనివాస్, బండి జంగమ్మ, కొల్లూరి రాజయ్య, కల్లెం కృష్ణ, గాలయ్య, వెంకటేష్, హరిచంద్ర పాల్గొన్నారు.