Share News

నిబంధనల మేరకు పరిహారం

ABN , Publish Date - May 29 , 2025 | 11:52 PM

ప్రభుత్వ నిబంధనల మేరకు ముం పు పరిహారం అందజేస్తామని అదనపు కలెక్టర్‌ జి.వీరారెడ్డి అన్నారు. గురువా రం భువనగిరి మండలం బీయన్‌ తిమ్మాపూర్‌ గ్రామంలోని ముంపు నిర్వాసితులతో ఆయన భువనగిరి ఆర్డీ వో ఎం.కృష్ణారెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు.

నిబంధనల మేరకు పరిహారం

అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి

భువనగిరి రూరల్‌, మే29(ఆంధ్రజ్యో తి): ప్రభుత్వ నిబంధనల మేరకు ముం పు పరిహారం అందజేస్తామని అదనపు కలెక్టర్‌ జి.వీరారెడ్డి అన్నారు. గురువా రం భువనగిరి మండలం బీయన్‌ తిమ్మాపూర్‌ గ్రామంలోని ముంపు నిర్వాసితులతో ఆయన భువనగిరి ఆర్డీ వో ఎం.కృష్ణారెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో పూర్తిగా ముంపునకు గురవుతున్న బీయన్‌తిమ్మాపూర్‌ నిర్వాసితులందరికీ న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కాగా ప్రభుత్వం విడుదల చేసిన రూ.30కోట్లతో రూ.12లక్షలలోపు విలువైన ఇళ్లకు 491 మందికి నోటీసులు జారీ చేసి వారి నుంచి బ్యాంకు అకౌం ట్‌, ఆధార్‌ కార్డు జీరాక్స్‌ పత్రాలను స్వీకరిస్తున్నామన్నారు. రెండు రోజుల్లో పరిహారాన్ని వారి ఖాతాలోనే జమ చేస్తామన్నారు. మొత్తం బీయన్‌తిమ్మాపూర్‌లో 834 నిర్మాణాలు ముంపురకు గురవుతున్నట్లు గతంలోనే అంచాన వేశామన్నారు. సమావేశంలో భువనగిరి, తుర్కపల్లి, బీబీనగర్‌, బొమ్మలరామారం, ఆలేరు తహసీల్దార్లు ఎన్‌.అంజిరెడ్డి, దేశ్యానాయక్‌, శ్యాంసుందర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రావు, ఆంజనేయులు, భువనగిరి డిప్యూటీ తహసీల్దార్‌ కోట్ల కల్యాణ్‌, ఆర్‌ఐలు సైదా సాహెబ్‌, బలరాం పాల్గొన్నారు.

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

భువనగిరి (కలెక్టరేట్‌): వర్షాకాలం, ప్రకృతి వైపరిత్యాల తో కలిగే ఆరోగ్య అనర్థాలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారు లు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి అన్నారు. సీజనల్‌ వ్యాధుల నియంత్రణపై కలెక్టరేట్‌లో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ శుక్రవారం డ్రైడే పాటించాలన్నారు. డీఎంహెచ్‌వో మనోహర్‌ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితిలో 24 గంటల క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎన్‌ శోభారాణి, పోగ్రాం ఆఫీసర్‌ సాయిశోభ, డీఆర్డీవో నాగిరెడ్డి, డెమో పాల్గొన్నారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

జిల్లాలో జూన్‌ 6న ముఖ్యమంత్రి పర్యటించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాల ని వీరారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో సమీక్షించారు.

జూన్‌ 6 నుంచి బడిబాట

జూన్‌ 6 నుంచి బడిబాట కార్యక్రమం నిర్వహించి ప్ర భుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచాలని వీరారెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జయశంక ర్‌ బడిబాటపై జిల్లా విద్యాధికారి సత్యనారాయణతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బడిబాటలో జూన్‌ 19వరకు నిర్వహించాలన్నారు.

తుర్కపల్లి: బస్వాపూర్‌ ప్రాజెక్టు నిర్మాణంలో ఇళ్లు, భూ ములు కోల్పోయిన భూ నిర్వాసితులందరినీ ఆదుకునేందు కు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపడుతుందని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి అన్నారు. మండలంలోని చోక్ల, కోక్యాతండ గిరిజనులతో భూ పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీపై గురువారం భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామ సభను నిర్వహించారు.

భూదాన్‌పోచంపల్లి: మండల పరిధిలోని ఇంద్రియాల, శివారెడ్డిగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి తనిఖీ చేశారు.

Updated Date - May 29 , 2025 | 11:52 PM