Share News

కొండెక్కిన కొబ్బరి

ABN , Publish Date - Jul 28 , 2025 | 12:38 AM

(ఆంధ్రజ్యోతి - మిర్యాలగూడ టౌన) అసలే శ్రావణం, ఆ పైన బోనం.. వరాలిచ్చే వరలక్ష్మి వ్రతం, అన్నాచెల్లెళ్ల అనుబంధ ప్రతీక రాఖీ.. ఇవన్నీ పండుగలే.. అంతెందుకు శుభప్రద మాసమని పిలిచే శ్రావణంలో ప్రతి రోజూ పండుగే.. ఇన్ని పండుగలున్న మాసంలో ఎన్ని కొబ్బరికాయలు కావాలి, మరెన్ని టెంకాయలు కొట్టాలి అయితే ఈ సీజనలో అదందరితో సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటారా.. కొబ్బరి కాయల ధరలు కొండెక్కాయి.

కొండెక్కిన కొబ్బరి

(ఆంధ్రజ్యోతి - మిర్యాలగూడ టౌన)

అసలే శ్రావణం, ఆ పైన బోనం.. వరాలిచ్చే వరలక్ష్మి వ్రతం, అన్నాచెల్లెళ్ల అనుబంధ ప్రతీక రాఖీ.. ఇవన్నీ పండుగలే.. అంతెందుకు శుభప్రద మాసమని పిలిచే శ్రావణంలో ప్రతి రోజూ పండుగే.. ఇన్ని పండుగలున్న మాసంలో ఎన్ని కొబ్బరికాయలు కావాలి, మరెన్ని టెంకాయలు కొట్టాలి అయితే ఈ సీజనలో అదందరితో సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటారా.. కొబ్బరి కాయల ధరలు కొండెక్కాయి.

ఫ టెంకాయ ధర అదరహో..

మునుపెన్నడూ లేని విధంగా కొబ్బరికాయ ధరలు పెరుగుతున్నాయి. పచ్చి కాయలు ధరలు ఆకాశాన్నంటడంతో టెంకాయల ధర మండిపోతోంది. అందుకు కారణాలెన్నో ఉన్న ప్రధానమైనవి రెండే.. అందుట్లో ఒకటి పంట దిగుబడి తగ్గడమైతే, మరొ కారణం కొబ్బరి బోండాలకు డిమాండ్‌ పెరగడం. కొబ్బరి సాగు అధికంగా పండించే కర్నాటక, కేరళ, తమిళనాడు, ఆంరఽధ రాష్ట్రాల్లో దిగుబడి గణనీయంగా తగ్గడంతో కాయలకు డిమాండ్‌ బాగా పెరిగింది. దీంతో హోల్‌ సేల్‌గానే ధర పెరగడంతో సాధారణ, సన్న రకాల కాయల ధర రూ. 25 నుంచి 30వరకు పలుకుతుండగా, మోస్తారు, లావు టెంకాయ ధర రూ. 35 నుంచి రూ.40 పలుకుతోంది.

ఫ దిగుబడి తగ్గడంతో..

పంట దిగుబడి తగ్గడంతోనే కొబ్బరి కాయల ధర పెరిగినట్లు వ్యాపారులంటున్నారు. కొబ్బరి సాగు కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా ఉండగా, కేరళ, ఆంధ్రప్రదేశ, తమిళనాడు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కర్నాటకలో పంట సాగు గణనీయంగా తగ్గగా, కేరళలో వరదల కారణంగా పంట నష్టం జరిగింది. ఇక తమిళనాడులో కొబ్బరి చెట్లకు చెద వచ్చి పంట దిగుబడి కాలేదు. ఇక కోనసీమలో అరకొరగా పండిన పంటలో సగభాగం కొబ్బరి బోండాలుగా విక్రయిస్తున్నారు. మిగతా సరుకుని ధర పెంచి విక్రయిస్తుండగా, కొందరు దళారులు వినాయక చవితి, దసరా, దీపావళి పండుగల కోసం అటకలపై(అదో రకమైన నిల్వ చేసే విధానం) ఉంచుతున్నట్లు మార్కెట్‌లో ప్రచారం జరుగుతోంది.

ఫ బొండాలు తెగ తాగుతుండటంతో..

కొబ్బరి బొండాల విపరీత వినియోగం టెంకాయల ధర పెరుగుదలకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. పోషకల విలువలు అధికంగా ఉన్న కొబ్బరి బోండాలను తాగాలని, వైద్య నిపుణులు సూచిస్తుండడంతో కరోనా అనంతరం కొబ్బరి బొండాల వినియోగం మరింతగా పెరిగింది. ఒక్కో బొండం ధర రూ. 50కి తక్కువగా (ఏ సీజనలో అయినా) ఉండటం లేదు. ఇక లీటర్‌ కొబ్బరి నీళ్ల ధర రూ.130 నుంచి 150గా ఉంటోంది. ఈ నేపఽథ్యంలో కొబ్బరి రైతులు పచ్చిగా, లేతగా ఉండగానే బోండాల వ్యాపారులకు విక్రర ుుస్తున్నారు. ఎక్కడో మిగిలినవి, ఎత్తుగా పెరిగి కోతకు అందకుండా ఉన్న వాటిని కొబ్బరి కాయలుగా విక్రయిస్తున్నారు.

ఫ హోల్‌సేల్‌గానే అధిక ధరలు..

కొబ్బరి కాయలను కొన్ని ప్రాంతాల్లో తూకంతో, మరి కొన్ని ప్రాంతాల్లో పీసులుగా అమ్ముతారు. కేరళ, తమిళనాడులో కిలో ధర రూ. 40 పలుకుతుండగా, ఏపీలోని కోనసీమ, కర్నాటక రాష్ట్రంలో కొత్త కొబ్బరి వెయ్యి కాయల ఽరూ. 24వేలు పలుకుతుండగా, పాత కాయల ధర రూ. 26కు చేరినట్లు హోల్‌సేల్‌ వ్యాపారులు వాపోతున్నారు. రవాణా, పొట్టుతీత తదిర ఖర్చులుంటాయంటున్నారు దుకాణాదారులు. గతంలో టన్నుల కొద్దీ దిగుమతి చేసుకునే వారమని, ధర ఎక్కువగా ఉన్న కారణంగా నలుగురైదుగురం కలిసి లోడు తెప్పించుకుంటున్నామని టెంకాయల హోల్‌ సేల్‌ వ్యాపారులు.

ఫ చుండూరు శ్రీనివాస్‌గుప్తా, మిర్యాలగూడ

ఽభక్తులకు భారం కాకుండా చూడాలి

ఆధ్యాత్మిక అవసరాలలో కొబ్బరి కాయలధి ప్రత్యేక స్థానం. ఇటీవల కాలంలో కొబ్బరి కాయల ధరలు బాగా పెరుతున్నాయి. బోండాలది అదే పరిస్థితి. కొబ్బరి చెట్టులో వృఽథాగా పోయేది ఏదీ ఉండదు. పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి, బొండాం, కాండం, ఆకులు, పిందెలు, పుల్లలు అన్నింటికీ డిమాండ్‌ బాగానే ఉంటుంది కదా.. ఇంత డిమాండ్‌ ఉన్న పంటను సాగు చేసేలా రైతులను ప్రభుత్వంప్రోత్సహించాల్సిన అవసరముంది. ముందుగా కొబ్బరికాయల ధరలు తగ్గించాలి.

- చుండూరు శ్రీనివాస్‌గుప్తా డాక్టర్స్‌కాలనీ, మిర్యాలగూడ.

ఫ వ్యాపారం కష్టతరంగా మారింది.

హోల్‌సేల్‌గానే కొబ్బరి కాయల ధరలు పెరగడంతో గిరాకీ పడిపోయింది. కోనసీమలో కాయ ధర రూ. 25, 26 పడుతోంది. తమిళనాడులో కిలో ధర. రూ.44గా ఉంది. గతంలో పోటీలు పడి సరుకు పంపే వారు ప్రస్తుతం పలు మార్లు అడిగినా దిగుమతి లేని కారణంగా పంపలేని పరిస్థితి ఉంది. పెరుగుతున్న ధరలతో వ్యాపారం కష్టతరంగా మారింది. లాభాల మాట అటుంచితే నష్టాలు రాకుంటే చాలన్నట్లుగా వ్యాపారం చేస్తున్నాం. ఽ

- ఎస్‌.సుబ్బారావు (హోల్‌సేల్‌ కొబ్బరి కాయల వ్యాపారి, మిర్యాలగూడ)

Updated Date - Jul 28 , 2025 | 12:38 AM