పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఇరు కుటుంబాల ఘర్షణ
ABN , Publish Date - Jul 26 , 2025 | 12:20 AM
సంస్థాన్‌నారాయణపురం, జూలై 25 (ఆంధ్రజ్యోతి): భార్యాభర్తల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు పోలీసుస్టేషన్‌కు వచ్చిన వారి కుటుంబీకులు ఒకరికొకరు దాడి చేసుకున్న వీడియో సోషల్‌మీడియా వైరల్ అయింది.
సంస్థాన్‌నారాయణపురం, జూలై 25 (ఆంధ్రజ్యోతి): భార్యాభర్తల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు పోలీసుస్టేషన్‌కు వచ్చిన వారి కుటుంబీకులు ఒకరికొకరు దాడి చేసుకున్న వీడియో సోషల్‌మీడియా వైరల్ అయింది. ఈ నెల 23వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండల కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. సంస్థాన్‌నారాయణపురం మండలంలోని బోటిమీదితండాకు చెం దిన భార్యాభర్తల మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు ఉన్నాయి. ఈ విషయమై ఇరు కుటుంబా ల సభ్యులు కొంతకాలంగా గొడవ పడుతున్నారు. ఈ ఘటనపై భార్య పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేయగా, ఈ నెల 23వ తేదీన ఇరు కుటుంబాలకు చెందినవారు పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. పెద్ద మనుషులతో మాట్లాడుకోవాలని పోలీసులు సూచించడంతో వారు మాట్లాడుకుని వివాదాన్ని పరిష్కరించుకున్నారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాలకు చెందిన ఒకరినొకరు దూషించుకోగా, మాటా మాటా పెరిగింది. పరిస్థితి తీవ్ర రూపం దాల్చడంతో ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీ్‌సస్టేషన్ ఆవరణలో ఘర్షణ జరుగుతుండడంతో పోలీసులు బయటకు వచ్చి ఘర్షణ పడుతున్న వారిని చెదరగొట్టారు. దాడికి కారణమైన రాందాసు, లచ్చిరాం, రాజేష్లపై పోలీసులు కేసు నమోదుచేసినట్లు ఎస్‌ఐ జగన్ తెలిపారు.