బాలల హక్కులను కాపాడాలి
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:24 AM
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసి, బాలల హక్కులను కాపాడాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) భాస్కర్‌రావు అన్నారు.
అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు
భువనగిరి (కలెక్టరేట్), జూలై 3 (ఆంధ్రజ్యోతి): బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసి, బాలల హక్కులను కాపాడాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) భాస్కర్‌రావు అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం అమలుపై పోలీసు శాఖ, విద్య, వైద్యం, మహిళా శిశు సంక్షేమ, కార్మిక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో బడికి రాని పిల్లలు, మధ్యలో బడి మానేసిన పిల్లలను గుర్తించి, పాఠశాలలో తిరిగి చేర్పించాలన్నారు. 14 ఏళ్లలోపు బాలలు కార్మికులుగా పని చేస్తున్నట్లు గుర్తిస్తే యజమానులపై కేసులు నమోదుచేస్తామన్నారు. ఆపరేషన్ ముస్కాన్ బృందం, కార్మిక శాఖ అధికారులతో కలిసి కంపెనీలు, దుకాణాలు, నిర్మాణ ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేసి బాల కార్మికులను గుర్తించాలన్నారు. అనంతరం చైల్డ్ హెల్ప్‌లైన్ లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి నర్సింహారావు, ఆర్డీవో ఎం.కృష్ణారెడ్డి, భువనగిరి రూరల్ సీఐ చంద్రబాబు, డీఈవో సత్యనారాయణ, డిప్యూటీ డీఎంహెచ్‌వో యశోద, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ అరుణ, బాల రక్షా కోఆర్డినేటర్ అనంతలక్ష్మి, సీడీపీవోలు పాల్గొన్నారు.
మౌలిక వసతులు కల్పించాలి
ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అన్నారు. కలెక్టరేట్‌లో భవిత కేంద్రాలు, కస్తుర్భా విద్యాలయాల వసతులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాలయాల్లో ప్రత్యేక అధికారుల భాగస్వామ్యంతో అవసరమైన మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో విద్యాశాఖ ఏడీ ఎన్.ప్రశాంత్‌రెడ్డి, ఈడబ్ల్యూఐడీసీ ఈఈ శైలజ, డీఈఈ శివకుమార్, ఏఈలు, విద్యాశాఖ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలి
ఆలేరు: వార్డు ఆఫీసర్లు ప్రజలకు అందుబాటు లో ఉండాలని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అన్నా రు. 100 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆలేరు మునిసిపల్ కార్యాలయంలో వార్డు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలగకుం డా చూడాలన్నారు. అనంతరం వనమహోత్సవంలో భాగంగా స్థానిక మునిసిపల్ కార్యాలయ సమీపం లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్, మేనేజర్ జగన్‌మోహన్ పాల్గొన్నారు.