Share News

అక్రమాలకు చెక్‌

ABN , Publish Date - Jul 04 , 2025 | 12:15 AM

పోషకాహార లోపంతో ఎవరూ అనారోగ్యం పాలు కావొద్దన్న ఉద్దేశం తో అంగన్‌వాడీకేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా కడుపు లో బిడ్డ పడిన దగ్గరి నుంచి పెరిగి పెద్ద యి ఆరేళ్ల వయస్సు వచ్చే వరకూ బలవర్దకమైన ఆహారం అందిస్తున్నారు. చిన్నారులతోపాటు వారి తల్లులకు కూడా నాణ్యమైన ఆహారం ఇస్తున్నా రు.

అక్రమాలకు చెక్‌

నకిలీ లబ్ధిదారుల తొలగింపే లక్ష్యంగా ఫేస్‌ రికగ్నైజేషన్‌

పారదర్శక సేవలకు శ్రీకారం

(ఆంధ్రజ్యోతి-బీబీనగర్‌): పోషకాహార లోపంతో ఎవరూ అనారోగ్యం పాలు కావొద్దన్న ఉద్దేశం తో అంగన్‌వాడీకేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా కడుపు లో బిడ్డ పడిన దగ్గరి నుంచి పెరిగి పెద్ద యి ఆరేళ్ల వయస్సు వచ్చే వరకూ బలవర్దకమైన ఆహారం అందిస్తున్నారు. చిన్నారులతోపాటు వారి తల్లులకు కూడా నాణ్యమైన ఆహారం ఇస్తున్నా రు. ఈ అంగన్‌వాడీ కేంద్రాల్లో అవకతవకలు జరగకుండా ఇక నుంచి ముఖ గుర్తింపు విధానాన్ని తీసుకొస్తున్నారు. దీంతో అక్రమాలకు చెక్‌ పడనుంది.

కేంద్రప్రభుత్వ ఆధీనంలో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రంలో లబ్ధిదారులకు అందిస్తు న్న పౌష్టికాహారం పంపిణీలో అక్రమాలకు చెక్‌ పడనుంది.అవకతవకలకు తావులేకుండా కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఆరు నెలలనుంచి మూడేళ్లు, మూడేళ్ల నుంచి ఆరేళ్ల పిల్లలతోపాటు గర్భిణులు, బాలింత మహిళల కు నెలనెల పౌష్టికాహారం అందించే సమయా ల్లో ఫేస్‌ రికగ్నైజేషన్‌ (ముఖం ఆధారిత గుర్తింపు)ను తప్పనిసరి చేసింది. కేంద్రాల్లో నకిలీ లబ్ధిదారులను తొలగించి అర్హులైన వారికి మాత్రమే పౌష్టికాహారం అందించి పారదర్శకత పెంచాల ని కేంద్ర ప్రభుత్వం ఈవిధానాన్ని తీసుకొచ్చిం ది.దీనికోసం ఇప్పటికే పోషణ్‌ ట్రాకర్‌ అనే యా ప్‌ను అందుబాటులోకి తెచ్చింది. యాప్‌ నిర్వహణపై అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు.

సెల్‌ఫోన్‌ ద్వారా ఫేస్‌ క్యాప్చర్‌

ఆయా అంగన్‌వాడీకేంద్రాల్లోని లబ్ధిదారులకు సంబంధించిన ఫొటోలు తీసి ఆధార్‌, కేవైసీ వివరాలను యాప్‌లో పొందుపరుస్తారు. వారికి అందిస్తున్న పోషకాహారం వివరాలను యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ప్రతీనెల లబ్ధిదారుడు కేంద్రానికి వచ్చిన తర్వాత ముఖ గుర్తింపు హాజరు తీసుకుని ఆహారం పంపిణీచేస్తారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు ఏ సరుకులు పంపిణీ చేశారో నేరుగా లబ్ధిదారుల సెల్‌ఫోన్‌లకు సమాచారం వెళ్లేలా యాప్‌ను రూపొందించారు. తద్వారా పౌష్టికాహారం పంపిణీ పక్కదా రి పట్టేందుకు అవకాశం ఉంది. అంతేకాకుండా అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులు ఉద యం, సాయంత్రం ముఖం ఆధారిత గుర్తింపు

పకడ్బందీగా అమలు చేస్తాం: శైలజ, సీడీపీవో

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫేస్‌ రికగ్నైజేషన్‌ విధానాన్ని పకడ్బందీగా అమలుచేస్తాం. ఈ మేరకు అన్ని కేంద్రాల్లో ఫేస్‌ క్యాప్చర్‌ ప్రక్రి య కొనసాగుతుంది. ఇప్పటికే 70నుంచి 80శాతం పూర్తి చేశాం. ఆధార్‌ గుర్తింపులో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వాటిని త్వరగా పూర్తి చేసేలా సిబ్బందికి సూచించాం. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విధానంతో పౌష్టికాహారం పంపిణీ పక్కదారి పట్టకుండా లబ్ధిదారులకు మాత్రమే అందే ఆస్కారం ఉంది. హాజరు తప్పనిసరి చేశారు. దీంతో కేంద్రాలకు ఎంతమంది వచ్చారో సెల్‌ఫోన్‌ ద్వారా ఫొటోలు తీసి కార్యకర్తలు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

కేంద్రాల్లో కొనసాగుతున్న ఫేస్‌ క్యాప్చర్‌ ప్రక్రియ

జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫేస్‌ క్యాప్చర్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. జిల్లాలో మొత్తం 901 అంగన్‌వాడీ కేంద్రాలుండగా, మొత్తం 49,365 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో ఆరు నెలల నుంచి మూడేళ్లు, మూడేళ్ల నుంచి ఆరేళ్ల పిల్లల వరకు 70నుంచి 80శాతం వరకు ఫేస్‌ క్యాప్చర్‌ ప్రక్రియ పూర్తయింది. గర్భిణులు, బాలింత మహిళలకు పోషన్‌ ట్రాకర్‌ అప్లికేషన్‌లో ఫేస్‌ రికగ్నైజేషన్‌ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానాన్ని అమలు చేసేందుకు అంగన్‌వాడీ కార్యకర్తలు సన్నద్ధమవుతున్నారు. మరికొన్ని రోజుల్లో ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానం ద్వారా లబ్ధిదారులకు ఆహారం అందించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

యాప్‌లో లబ్ధిదారుల వివరాలు పొందుపరుస్తాం: పి.విజయలక్ష్మి, అంగన్‌వాడీ టీచర్‌, బీబీనగర్‌

ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వారా లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అధికారుల ఆదేశాలతో లబ్ధిదారుల ఫొటోలను క్యాప్చర్‌ చేసి వారి ఆధార్‌తో లింక్‌ చేస్తున్నాం. ఈకేవైసీతోపాటు లబ్ధిదారులకు అందిస్తున్న ఆహారపు వివరాలను పోషణ్‌ ట్రాకర్‌ యాప్‌లో పొందుపరుస్తున్నాం.

Updated Date - Jul 04 , 2025 | 12:15 AM