శతవసంత వేడుక
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:53 PM
వందేళ్లు పూర్తి చేసుకున్న ఓ వృద్ధుడిని గ్రామాభివృద్ధి కమిటీ సన్మానించింది. ఆయన జన్మదినాన్ని వేడుకగా జరిపించారు.
102 ఏళ్ల వృద్ధుడికి గ్రామాభివృద్ధి కమిటీ సన్మానం
వందేళ్లు పూర్తి చేసుకున్న ఓ వృద్ధుడిని గ్రామాభివృద్ధి కమిటీ సన్మానించింది. ఆయన జన్మదినాన్ని వేడుకగా జరిపించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన ఓడపల్లి సోమయ్యకు 102 ఏళ్లు. ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. మనమళ్లు, మనమరాళ్లు కలిపి 25 మంది. నాలుగు తరాలను చూసిన సోమయ్యను, ఆయన సతీమణి రామక్కతో గురువారం కేక్ కట్ చేయించి, శాలువాతో కమిటీ సన్మానించింది. వందేళ్లు జీవించిన వ్యక్తి గ్రామంలో ఉండటం, వారి అనుభవాలు గ్రామాభివృద్ధికి తోడ్పడతాయని కమిటీ బాధ్యులు గొడుగు రమేష్ తెలిపారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు ఏసీ రెడ్డి, లక్ష్మణ్, వెంకన్న, నరేష్, కృష్ణయ్య, జే మహేష్, ఉప్పలయ్య, యాదగిరి, రవీందర్, రామకృష్ణ, భాస్కర్, బాలరాజు, లక్ష్మయ్య, సోమనర్సయ్య, భిక్షం, మల్లేష్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
(ఆంధ్రజ్యోతి-తిరుమలగిరి రూరల్)