Share News

అక్రమ బ్లాస్టింగ్‌కు యత్నించిన వారిపై కేసు

ABN , Publish Date - May 21 , 2025 | 12:35 AM

వలిగొండ, మే 20 (ఆంధ్రజ్యోతి): నిబంధనలకు విరుద్ధ్దంగా అక్రమ పేలుడు పదార్థాలతో అక్రమంగా బ్లాస్టింగ్‌కు యత్నించిన వారిపై కేసు నమోదు చేశారు.

అక్రమ బ్లాస్టింగ్‌కు యత్నించిన వారిపై కేసు

వలిగొండ, మే 20 (ఆంధ్రజ్యోతి): నిబంధనలకు విరుద్ధ్దంగా అక్రమ పేలుడు పదార్థాలతో అక్రమంగా బ్లాస్టింగ్‌కు యత్నించిన వారిపై కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ యుగేందర్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వేములకొండ గ్రామానికి చెందిన కొలగాని యాదయ్య తన భూమిలో బండరాళ్లను తొలగించడానికి మోత్కూరు మండలం పాలడుగు గ్రామానికి చెందిన కంప్రెషర్‌ యాజమాని బొంత బొబ్బిలితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈనేపథ్యంలో సోమవారం పేలుడు పదార్థం బండరాళ్లను తొలగించడానికి సిద్ధ్దమయ్యారు. విశ్వసనీయమైన సమాచారం మేరకు పోలీసుల సంఘటన స్థలానికి చేరుకొని 23 జిలిటెనస్టిక్స్‌, 15 డిటోనేటర్లు, ఒక మేగ్గర్‌ బాక్స్‌ , 3బండిళ్ల బైండింగ్‌ కేబుల్స్‌, 10 మీటర్ల గాడ్‌ వైరును పట్టివేశారు. సదరు నిందుతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - May 21 , 2025 | 12:35 AM