ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
ABN , Publish Date - May 28 , 2025 | 12:29 AM
అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం రాశులపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి రైతులను సూచించారు.
వలిగొండ, రామన్నపేట, మే 27 (ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం రాశులపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి రైతులను సూచించారు. మంగళవారం నాగారంలోని ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఆందోలనకు చెందవద్దని సూచించారు. సకాలంలో ధ్యానం కొనుగోలును పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దశరథ, ఏవో అంజనీదేవి, ఎంఆర్‌ఐ కరుణాకర్‌రెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు. నైరుతీ రుతుపవనాల రాక నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ జీ.వీరారెడ్డి అధికారులను ఆదేశించారు. రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తేమ సమస్య తలెత్తకుండా రైతులు జాగ్రత్తలు పాటించాలని, ఎప్పటి ధాన్యాన్ని అప్పుడే కాంటా వేసి మిల్లుకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ లాల్‌బహుదూర్, ఏపీఎం ప్రసాద్, మాజీ సర్పంచ పూస బాలనర్సింహ్మా, సీసీలు, కేంద్రం ఇంచార్జ్‌లు ఉన్నారు.