‘గంధమల్ల’ సామర్థ్యం పెంచాలి
ABN , Publish Date - Jun 23 , 2025 | 12:02 AM
ఆలేరు నియోజకవర్గానికి సాగునీటి సమస్య గంధమల్లతోనే పరిష్కారమని, దాని సామర్ధ్యాన్ని ఐదు టీఎంసీలకు పెంచాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు
రాజాపేట, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ఆలేరు నియోజకవర్గానికి సాగునీటి సమస్య గంధమల్లతోనే పరిష్కారమని, దాని సామర్ధ్యాన్ని ఐదు టీఎంసీలకు పెంచాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. ఆదివారం రాజాపేట మండలం బేగంపేటలో పార్టీ 13వ మండల మహాసభలో పాల్గొని మా ట్లాడారు. మండలకేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని, చల్లూరు చెరువు కట్టను వెడల్పుచేసి వీరారెడ్డిపల్లి వరకు డబుల్ రోడ్డుగా మార్చాలన్నారు. చల్లూరు, బేగంపేట గ్రామాల్లో ప్రభుత్వ భూములను కాపాడాలని, బీడీ కార్మికులందరికీ పింఛన్లు చెల్లించాలని, తపాసుపల్లి రిజర్వాయర్ ద్వారా రాజాపేట మండలానికి నీరందించి గొలుసుకట్టు చెరువులను నింపాలని తీర్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ రేషన్‌కార్డులను అందించాలన్నారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు కొల్లూరి రాజయ్య, దామోదర్, బొలగాని సత్యనారాయణ, చిగుర్ల లింగం, చెక్క వెంకటేశ్, గోరేటి రాములు, మహేందర్, ప్రభాకర్ పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట: యాదగిరీశుడి భక్తులకు కావాల్సిన మెరుగైన సదుపాయాలు కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు అన్నారు. యాదగిరికొండపై ఆదివారం పార్టీ కార్యకర్తలతో కలిసి దేవాదాయ కమిషనర్, ఆలయ ఈవో ఎస్.వెంకట్రావును కలిసి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ఆయనవెంట పార్టీ నాయకులు ఉన్నారు.