Share News

అప్పులు తీసుకొని వ్యాపారి పరారీ

ABN , Publish Date - May 25 , 2025 | 12:19 AM

భువనగిరి టౌన, మే 24 (ఆంధ్రజ్యోతి) : ఓ వ్యాపార కుటుంబం పలువురి వద్ద అప్పులు చేసి తీర్చలేక పరారైన ఘటన శనివారం యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరిలో వెలుగుచూసింది.

 అప్పులు తీసుకొని వ్యాపారి పరారీ

భువనగిరి టౌన, మే 24 (ఆంధ్రజ్యోతి) : ఓ వ్యాపార కుటుంబం పలువురి వద్ద అప్పులు చేసి తీర్చలేక పరారైన ఘటన శనివారం యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరిలో వెలుగుచూసింది. దీంతో అప్పు ఇచ్చిన ఓ మహిళా ఆత్మహత్యకు యత్నించగా పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పట్టణ ఇనస్పెక్టర్‌ రమే్‌షకుమార్‌, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం అనిగిరి అవినాష్‌ భువనగిరిలోని ఠాగూర్‌ రోడ్డులో రుద్ర డ్రై ఫ్రూట్స్‌ పేరిట వ్యాపారం చేస్తున్నారు. డ్రై ఫ్రూట్స్‌, మసాలాల ప్యాకింగ్‌ ఇతర పనుల కోసం అతడి వద్ద ఏడుగురు మహిళలు పనిచేస్తున్నారు. దీంతో వారందరినీ నమ్మబలికి వారి సొంత పైసలతోపాటు వారికి తెలిసిన వారి దగ్గర సుమారు రూ.30 లక్షలకు పైగా అప్పులు తీసుకున్నాడు. ఈ క్రమంలో తోట సరిత అనే కార్మికురాలు సొంతంగా రూ.2.40 లక్షలు, మరో రూ.లక్ష ఇతరుల నుంచి అవినా్‌షకు అప్పుగా ఇప్పించింది. కానీ అతను తిరిగి ఇవ్వగపోగా మూడు రోజుల నుంచి ఇంటికి తాళం ఉండటం, ఫోన స్వీచ్ఛా్‌ఫ వస్తుండటంతో, రూ.లక్ష ఇచ్చిన వారు ఫోన చేస్తుండటంతో ఆందోళనకు గురైన సరిత శనివారం ఇంటిలోని క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరించారు. అయితే ఇటీవల విడాకులు తీసుకున్న మరో కార్మికురాలి పుస్తెలతాడును కూడా అతడు తీసుకొని తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నట్టు తెలిసింది. అలాగే పలువురి నుంచి చిట్టీలు, అప్పులు, ఫైనాన్స పేరిట భారీ మొత్తంలో అప్పులు చేసిన కుటుంబం గుట్టు చప్పుడు కాకుండా మూడు రోజుల క్రితం పరారైందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు న్యాయం చేయాలని పోలీసులకు ఆశ్రయిస్తున్నారు. అయితే మోసపోయిన వారందరూ పోలీసులకు ఫిర్యాదులు చేయడం లేదా పరారైన అవినాష్‌ పట్టుబడడం, తిరిగి వస్తేనే అప్పుల, బాధితుల వివరాలు తేలుతాయని పలువురు అంటున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదుల మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఇనస్పెక్టర్‌ రమే్‌షకుమార్‌ తెలిపారు.

Updated Date - May 25 , 2025 | 12:19 AM