సూర్యాపేట - పల్నాడు జిల్లాలకు బస్సు సౌకర్యం
ABN , Publish Date - Jun 19 , 2025 | 12:14 AM
(ఆంధ్రజ్యోతి - హుజూర్‌నగర్ ) తెలుగు రాష్ర్టాల మధ్య పల్లె వెలుగు బస్సును ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. సూర్యాపేట-పల్నాడు జిల్లాల మధ్య అధికారు లు పల్లెవెలుగు బస్సును ప్రారంభించారు.
(ఆంధ్రజ్యోతి - హుజూర్‌నగర్ )
తెలుగు రాష్ర్టాల మధ్య పల్లె వెలుగు బస్సును ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. సూర్యాపేట-పల్నాడు జిల్లాల మధ్య అధికారు లు పల్లెవెలుగు బస్సును ప్రారంభించారు. మే 24న ఆంధ్రజ్యోతిలో ‘వంతెన ఉన్నా బస్సులు ఏవీ’’ అనే వార్త కథనానికి అధికారులు స్పం దించారు. కోదాడ ఆర్టీసీ డిపో అధికారులు ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు రీజనల్ మేనేజర్‌తో మాట్లాడి రెండు రాష్ర్టాల మధ్య బస్సును కోదాడ డిపో మేనేజర్ శ్రీనివాసరావు బుధవారం ప్రారంభించారు. 2013లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారంతో రూ. 50 కోట్లతో మట్టపల్లి వద్ద లక్ష్మీనర్సింహాస్వామి బ్రిడ్జి నిర్మా ణం ప్రారంభించగా 2014 నాటికి పూర్తి చేశారు. నేటికీ ఈ వంతెనను అధికారికంగా ప్రారంభించకపోయినా రెండు రాష్ర్టాల మధ్య రాకపోకలు జరుగుతున్నాయి. మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో 20 13లో ఈ వంతెనకు ఉమ్మడి ఏపీ గవర్నర్‌గా ఉన్న నర్సింహన్ శంకుస్థాపన చేశారు. గడిచిన 12 ఏళ్లుగా బ్రిడ్జి పూర్తిచేసినా ఆర్టీ సీ అధికారులు ఈ వంతెన మీదుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించలేదు. పన్నెండేళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉత్తమ్ ఆదేశాల మేరకు బస్సు రవాణా సౌకర్యం కల్పించడం గమనార్హం.
ప్రయాణం ఇలా..
కోదాడ నుంచి చిలుకూరు, హుజూర్‌నగర్, మఠంపల్లి, పెదవీడు, మట్టపల్లి లక్ష్మీనర్సింహాస్వామి వంతెన మీదుగా ఏపీలోని పల్నా డు జిల్లాలో గల తంగెడ, ముత్యాలంపాడు, దాచేపల్లి వరకు అధికారులు బస్సు సౌకర్యాన్ని ప్రారంభించడం విశేషం. కోదాడ నుంచి హుజూర్‌నగర్ మీదుగా దాచేపల్లి వరకు 58 కిలోమీట ర్ల దూరం ఉంటుంది. కాగా ప్రతి రోజు కోదాడ నుంచి ఉదయం 7.30 నుంచి బయలుదేరి 9 గంటలకు దాచేపల్లికి చేరుకుంటుంది. కాగా తిరిగి ప్రతిరోజు మూడు ట్రిప్పులు బస్సు సౌక ర్యం కల్పించారు.
గతంలో దాచేపల్లికి వెళ్లాలంటే హుజూర్‌నగర్ నుంచి మిర్యాలగూడ మీదుగా దాచేపల్లికి వెళ్లాల్సి ఉండేది. బస్సు సౌకర్యం కల్పించడంతో తెలుగు రాష్ర్టాల మధ్య రవాణా సౌకర్యం మెరుగు పడిందని ప్రయాణికులు పేర్కొంటున్నారు.