బీసీలపై పాలక, ప్రతిపక్షాలది కపట ప్రేమ
ABN , Publish Date - Jul 16 , 2025 | 12:31 AM
స్థాని క సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు అంటూ పాల క, ప్రతిపక్షాలు బీసీలపై కపట ప్రేమ చూపుతున్నాయని టీడీపీ తుంగతుర్తి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు నక్క రాంభానేస్ ముదిరాజ్, నియోజక వర్గ కన్వీనర్ ఆకారపు రమేష్ విమర్శించారు.
టీడీపీ తుంగతుర్తి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు రాంభానేస్ ముదిరాజ్
మోత్కూరు, జూలై 15 (ఆంధ్రజ్యోతి): స్థాని క సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు అంటూ పాల క, ప్రతిపక్షాలు బీసీలపై కపట ప్రేమ చూపుతున్నాయని టీడీపీ తుంగతుర్తి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు నక్క రాంభానేస్ ముదిరాజ్, నియోజక వర్గ కన్వీనర్ ఆకారపు రమేష్ విమర్శించారు. మంగళవారం మోత్కూరులో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో టీడీపీ బీసీలకు 33శాతం రిజర్వేషన్లు ఇచ్చి బడుగు, బలహీన వర్గాలకు పాలనలో భాగస్వామ్యం కల్పించిందన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటుండగా, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ అది అమలయ్యేది కాదంటూ మల్లగుల్లాలు పడుతున్నాయని విమర్శించారు. అనంతరం టీడీపీ మోత్కూరు మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దామరోజు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా దేవర మల్లయ్య, ప్రధాన కార్యదర్శులుగా మహేశ్వరం వెంకటేశ్వర్లు, ఎగుమాటి బొందిరెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా మెంట ఎల్లేష్, సూదగాని ఆంజనేయులు, జిల్ల రత్నం, కార్యదర్శులుగా కుక్కల యాదగిరి, సాదుల సత్తయ్య, కోశాధికారిగా బత్తిని సుదర్శన్, పట్టణ అధ్యక్షుడిగా ఎండీ గాలిబ్, ఉపాధ్యక్షుడిగా బయ్యని జనార్ధన్, ప్రధాన కార్యదర్శిగా గొడిశాల శ్రీను, కార్యనిర్వాహక కార్యదర్శులుగా గొడిశాల మానస, జాకీర్, గుండు రాజు, కార్యదర్శులుగా బాలగాని నర్సయ్య, ఎడ్ల రాములు, సతీష్, కోశాధికారిగా మెంట నీలమ్మ ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు.