బీసీ రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకించడం సరికాదు
ABN , Publish Date - Aug 06 , 2025 | 01:10 AM
బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకించడం సరికాదని, దేశ వ్యాప్తంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని సీపీఎం జిల్లా కమిటీసభ్యుడు మద్దెల రాజయ్య మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు.
వలిగొండ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకించడం సరికాదని, దేశ వ్యాప్తంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని సీపీఎం జిల్లా కమిటీసభ్యుడు మద్దెల రాజయ్య మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 42శాతం బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడటం మనువాద భావజాలానికి నిదర్శనమన్నారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలన్నారు. బీసీని అని చెబుతున్న ప్రధాని నరేంద్రమోదీ 42శాతం రిజర్వేషన్లను అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు వెంకటేశం, శ్రీనివాస్, సత్తిరెడ్డి, వెంకట్‌రెడి,్డ గోపాల్, యాదయ్య, ముత్యాలు, లింగం, సురేష్ తదితరులు పాల్గొన్నారు.