ఉగ్రవాదాన్ని అంతం చేయడమే బీజేపీ లక్ష్యం
ABN , Publish Date - May 18 , 2025 | 12:15 AM
ఉగ్రవాదా న్ని అంతం చేయడమే బీజేపీ లక్ష్యమని తిరంగా యాత్ర జిల్లా కన్వీనర్ మాయ దశరథ అన్నారు. శనివారం భువనగిరిలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
20న తిరంగా యాత్ర.. పాల్గొననున్న ఈటల రాజేందర్
తిరంగా యాత్ర జిల్లా కన్వీనర్ దశరథ
భువనగిరి టౌన్, మే 17 (ఆంధ్రజ్యోతి): ఉగ్రవాదా న్ని అంతం చేయడమే బీజేపీ లక్ష్యమని తిరంగా యాత్ర జిల్లా కన్వీనర్ మాయ దశరథ అన్నారు. శనివారం భువనగిరిలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ ఆదేశానుసారం ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత త్రివిధదళాలు పాకిస్తాన్‌ను కోలుకోలేని దెబ్బతీశాయన్నారు. ఉగ్రవాద శిక్షణా శిబిరాలను, ఉగ్రవాదులను తుద ముట్టించి దాయాది పాకిస్తాన్‌పై సాధించిన విజయానికి గుర్తుగా 20న భువనగిరిలో తిరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిఽథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. దేశభక్తులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలంందరూ పాల్గొనాలన్నారు. సమావేశంలో కిసాన్‌మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్‌మోహన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం, నాయకులు జన్నపల్లి శ్యాంసుందర్‌రెడ్డి, పట్నం శ్రీనివాస్, చందా మహేందర్‌గుప్తా, జయంతి, నీలం రమేష్, జనగాం కవిత, ఇండ్ల సత్యవతి, కోళ్ల భిక్షపతి, వెంకటేశ్వర్లు, కృష్ణచారి పాల్గొన్నారు.