Share News

భువనగిరి బుడ్డోడి ప్రపంచ రికార్డు

ABN , Publish Date - Jul 19 , 2025 | 12:57 AM

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి పట్టణానికి చెందిన ఐదేళ్ల చిన్నారి చావా తారక్‌ నంద ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో రెండోసారి చోటు సాధించాడు.

భువనగిరి బుడ్డోడి ప్రపంచ రికార్డు
చావా తారక్‌ నందను అభినందిస్తున్న కలెక్టర్‌ హనుమంతరావు, చిత్రంలో తారక్‌ తల్లిదండ్రులు డాక్టర్‌ రాజ్‌కుమార్‌, డాక్టర్‌ అశ్లేష

4.20 నిమిషాల్లో ప్రపంచ దేశాలు, వాటి రాజధానుల పేర్లు

బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న తారక్‌ నంద

భువనగిరి టౌన, జూలై 18 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి పట్టణానికి చెందిన ఐదేళ్ల చిన్నారి చావా తారక్‌ నంద ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో రెండోసారి చోటు సాధించాడు. స్థానిక ఆర్‌కే ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్‌ చావా రాజ్‌కుమార్‌, డాక్టర్‌ చావా అశ్లేష దంపతుల కుమారుడైన ఒకటో తరగతి చదువుతున్న తారక్‌ నంద మేలో వీడియో రికార్డింగ్‌ ఆధారంగా జరిగిన పోటీల్లో ప్రపంచ దేశాలు, వాటి ర్టాజధానుల పేర్లను 4 నిమిషాల 20 సెకన్ల వ్యవధిలో చెప్పి ప్రపంచ రికార్డు సాధించాడు. ఇటీవలి వరకు యూరప్‌కు చెందిన ఐదేళ్ల బాలిక 5 నిమిషాలతో ఉన్న రికార్డులను తారక్‌ నంద ఛేదించాడు. ఈ మేరకు మూడు రోజుల క్రితం ( ఈనెల 15వ తేదీన) ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నిర్వాహకులు వివరాలను వెల్లడించారు. అయితే గతంలోనూ వంద దేశాల పేర్లు, వాటి రాజధానులను అనర్గళంగా చెప్పి ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కాడు. ఈ మేరకు ప్రపంచ రికార్డు సృష్టించిన తారక్‌ నందను కలెక్టర్‌ ఎం.హనుమం తరావు, డీసీపీ అక్షాంశ యాదవ్‌ అభినందించారు.

Updated Date - Jul 19 , 2025 | 12:57 AM