Share News

భువనగిరి 230

ABN , Publish Date - Jul 19 , 2025 | 12:46 AM

స్వచ్ఛ సర్వేక్షణ్‌- 2024 ర్యాంక్‌లను కేంద్ర ప్రభు త్వం విడుదల చేసింది. 12 కేటగిరీలలో 12500 మార్కులకు గాను దేశవ్యాప్త మునిసిపాలిటీల లో జరిగిన పోటీలలో భువనగిరి మునిసిపాలిటీకి 230 జాతీయస్థాయి, రాష్ట్రస్థాయిలో 33వ ర్యాంక్‌ వచ్చింది.

భువనగిరి 230

మునిసిపాలిటీల స్వచ్ఛ సర్వేక్షణ్‌-2024 ర్యాంక్‌లు విడుదల

భువనగిరికి జాతీయస్థాయిలో 230, రాష్ట్రంలో 33వ స్థానం

ఆగస్టు 15న అందజేయనున్న అవార్డులు

భువనగిరి టౌన్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ సర్వేక్షణ్‌- 2024 ర్యాంక్‌లను కేంద్ర ప్రభు త్వం విడుదల చేసింది. 12 కేటగిరీలలో 12500 మార్కులకు గాను దేశవ్యాప్త మునిసిపాలిటీల లో జరిగిన పోటీలలో భువనగిరి మునిసిపాలిటీకి 230 జాతీయస్థాయి, రాష్ట్రస్థాయిలో 33వ ర్యాంక్‌ వచ్చింది. అలాగే ర్యాంక్‌ల సాధనలో యాదగిరిగుట్ట ప్రతిభ చూపగా మిగతా నాలుగు మునిసిపాలిటీలు పలు కారణాలతో వెనుకంజ లో ఉన్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌ కేంద్ర బృందాలు పరిశీలనకు వచ్చినప్పుడు మాత్రమే మెప్మా ఆర్పీలు, స్వయం సహాయక సంఘం సభ్యులు ముగ్గురు పరిశుభ్రత, ఇతర కార్యక్రమాల పేరి ట హడావుడి చేయగా మిగతా రోజుల్లో అం తంత మాత్రంగానే పారిశుధ్యం ఉన్నట్లు బృందాలు గుర్తించాయి. అలాగే అభిప్రాయాల వ్యక్తీకరణలో ప్రజల భాగస్వామ్యం స్వల్పంగా ఉండటం కూడా ర్యాంకులు తగ్గడానికి కారణమైందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికైనా పట్టణ పారిశుధ్యంపై అధికారులు శ్రద్ధ చూపాలని, అదే సమయంలో ప్రజలు కూడా తమవంతు బాధ్యతను నిర్వహించాలని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. ఆగస్టు 15న మునిసిపల్‌ అధికారులకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులను అందజేయనున్నారు. 12 కేటగిరీలలో 12500 మార్కులను లెక్కిస్తారు. సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు.

మార్కుల లెక్కింపు ఇలా..

కేటగిరీ మార్కులు

వ్యక్తిగత మరుగుదొడ్లు, చెత్తకుప్పలు లేని పట్టణాలు 2500

శుభ్రంగా కనిపించడం 1500

వ్యర్థ పదార్థాల నిర్వహణ 1500

అడ్వకసీ ఫర్‌ స్వచ్ఛత 1500

చెత్త సేకరణ, కంపోస్ట్‌ యార్డుకు తరలింపు 1000

అత్యధిక పారిశుధ్యం 1000

మురుగు నీటి నిర్వహణ 1000

పర్యావరణ వ్యవస్థ బలోపేతం 1000

సెప్టిక్‌ ట్యాంకుల క్లీనింగ్‌ 500

పారిశుధ్య కార్మికుల సంక్షేమం 500

సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌ 500

మొత్తం మార్కులు 12500

మునిసిపాలిటీ మార్కులు రాష్ట్ర ర్యాంక్‌ జాతీయ ర్యాంక్‌

భువనగిరి 7920 33 230

యాదగిరిగుట్ట 6914 68 755

మోత్కూరు 6021 99 1081

ఆలేరు 5866 102 1144

చౌటుప్పల్‌ 5834 104 1033

పోచంపల్లి 4806 128 1525

Updated Date - Jul 19 , 2025 | 12:46 AM