Share News

పేదలకు మెరుగైన వైద్యసేవలు

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:29 AM

పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కాం గ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

పేదలకు మెరుగైన వైద్యసేవలు
హుజూర్‌నగర్‌ ఆసుపత్రిలో సీటి స్కాన్‌ను ప్రారంభిస్తున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హుజూర్‌నగర్‌ , ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కాం గ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం హుజూర్‌నగర్‌ పట్టణంలో రూ.3.5 కోట్లతో నిర్మించనున్న ఓపీ నూతన బ్లాక్‌, ధోబీఘాట్‌, పార్కింగ్‌ షెడ్లకు శంకుస్థాపన చేశారు. రూ.1.25 కోట్లతో నిర్మించిన రక్తనిధి, డయాలసిస్‌ సెంటర్‌ను ప్రారంభించారు. రూ.3.5కోట్లతో ఏర్పాటుచేసిన సీటి స్కాన్‌ను ప్రా రంభించారు. అదేవిధంగా పట్టణంలోని మెయిన్‌రోడ్డులోని ఎన్నెస్పీ స్థలంలో రూ.8 కోట్లతో నిర్మించే ఎన్నెస్పీ కార్యాలయాల సమీకృత భవనాలకు మంత్రి ఉత్తమ్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం విద్యుత్‌ కార్యాలయం ఎదుట అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి, మాట్లాడారు. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా వైద్యులు పనిచేయాలన్నారు. కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించేందుకు రక్తనిధి, డయాలసిస్‌, స్కానింగ్‌ సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మాజీ సీఎం రోశయ్య హయాంలో 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయించానన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించి అండగా ఉండాలన్నారు. పట్టణంలో రూ.7.5 కోట్లతో జూనియర్‌ కళాశాల, రూ.4.5 కోట్లతో డిగ్రీ కళాశాల భవనాలు నిర్మిస్తున్నామన్నారు. ఫణిగిరి గట్టు వద్ద 2,160 మోడల్‌ కాలనీ ఇళ్లు నిర్మిస్తున్నామని త్వరలోని వాటిని పేదలకు పంపిణీ చేస్తామన్నారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్లు, గ్రామీణ రహదారులు నిర్మించామన్నారు. ఐటీఐ, ఏటీసీ కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు కొత్త బస్టాండ్‌కు రూ.4.5 కోట్లు మంజూరు చేయించానన్నారు. గడ్డిపల్లిలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలను ప్రారంభించామన్నారు. మట్టపల్లి, జాన్‌పాడ్‌లను ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖాధికారి చంద్రశేఖర్‌, డీసీహెచ్‌ఎస్‌ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డీఎంహెచ్‌వో జయమనోహ రి, డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, డాక్టర్‌ వనజ, డాక్టన్‌ ప్రవీణ్‌కుమార్‌గౌడ్‌, శ్రీనివాసరెడ్డి, డాక్టర్‌ నాగమణి, తన్నీరు మల్లికార్జున్‌రావు, యరగాని నాగన్న, మాజీ ఎంపీపీ గూడెపు శ్రీను, శ్రీనివా్‌సగౌడ్‌, గెల్లి రవి, అజీజ్‌పాషా, సంపత్‌రెడ్డి పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ ఆలోచనలే కాంగ్రెస్‌ మూల సిద్ధాంతం : మంత్రి ఉత్తమ్‌

అంబేడ్కర్‌ ఆలోచన విధానమే కాంగ్రెస్‌ మూల సిద్ధాంతమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని విద్యుత్‌ కార్యాలయం ఎదుట నూతనంగా ఏర్పాటుచేసిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించి, మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి అని, సామాజిక న్యా యం కోసం పనిచేసిన గొప్ప సంఘసంస్కర్త అంబేడ్కర్‌ అని కొనియాడారు. బీజేపీ ప్రభుత్వం, ఎన్నికల సంఘం కుమ్మక్కై, లక్షలాది ఓటర్లను జాబితా నుంచి తొలగించి దొంగ ఓటర్లను చేర్పించారన్నారు. ఓటు చోరీ కేసులో రాహుల్‌గాంధీ బిహార్‌లో చేస్తు న్న పాదయాత్రకు దేశ ప్రజలు మద్దతు ఇవ్వాలన్నారు. 300 మంది ఎంపీలను అరెస్ట్‌ చేయడం సిగ్గుచేటన్నారు. అంబేడ్కర్‌ 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పిస్తే ఎన్నికల సంఘం ఆ ఓట్లను తొలగించిందని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే రాహుల్‌ పాదయాత్ర చేస్తున్నారన్నారు. అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వంగా భావిస్తున్నానన్నారు. సామాజిక న్యాయమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సామాజిక న్యాయం కోసం, పౌరుల హక్కుల కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్నా రు. బీజేపీకి తొత్తుగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ ఫ్రాంక్లిన్‌, డీఈలు అమరబోయిన శ్రీనివాసులు, వెంకటకృష్ణయ్య, ఏడీఈలు సక్రూనాయక్‌, నాగిరెడ్డి, రాంప్రసాద్‌, పోతురాజు రమేష్‌, జగదీష్‌, వడ్డాణపు గురవయ్య, రామునాయక్‌, పి.శ్రీనివాసు, సైదా, ఆర్‌.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 12:29 AM