Share News

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jul 26 , 2025 | 12:22 AM

భారీ వర్షాలతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరా జ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి పం చాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీధర్‌, డైరెక్టర్‌ సృజనలతో కలిసి ‘వర్షాలు, సీజనల్‌ వ్యాధులు, ముందస్తు జాగ్రత్తలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

భువనగిరి (కలెక్టరేట్‌), జూలై 25 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరా జ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి పం చాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీధర్‌, డైరెక్టర్‌ సృజనలతో కలిసి ‘వర్షాలు, సీజనల్‌ వ్యాధులు, ముందస్తు జాగ్రత్తలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. విరామం లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా లో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంద ని,ముందస్తు జాగ్రత్తలు వహించాలన్నారు. వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులతోపాటు సంబంధిత అధికారులంతా అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పని చేయాలన్నా రు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఫీవర్‌ సర్వే నిర్వహించాలని,గ్రామపంచాయితీ అధికారు లు పారిశుధ్యంపై దృష్టి సారించాలన్నారు. విష జ్వరాలు రాకుండా, దోమల లార్వా పెరగకుండా డ్రైనేజీలను శుభ్రపరిచి నీటి నిల్వ లేకుండా చూడాలన్నారు. తాగునీటి సరఫరా పైపులైన్ల మరమ్మతులు చేపట్టి ఓహెచ్‌ఎ్‌సఆర్‌ ట్యాంకులను శుభ్రం చేసి క్లోరినేషన్‌ చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) భాస్కర్‌రావు, జడ్పీ సీఈవో ఎన్‌.శోభారాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టీ.నాగిరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ కరుణాకరన్‌, తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి : కలెక్టర్‌

ఆత్మకూరు(ఎం) జూలై 25(ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్‌ వి.హనుమంతరావు లబ్ధిదారులకు సూచించారు. మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల పనులను శుక్రవారం కలెక్టర్‌ పరిశీలించా రు. ఈ సందర్భంగా కలెక్టర్‌ లబ్ధిదారులతో మా ట్లాడుతూ డబ్బుల విషయంలో ఆందోళన చెం దవద్దని, ఇంటి నిర్మాణ దశను బట్టి పనులు పూర్తి చేసిన వెంటనే ఖాతాల్లో జమ అవుతాయన్నారు. ఇంటి నిర్మాణ పనుల ప్రారంభానికి డబ్బులు లేకపోతే మహిళా సంఘాల ద్వారా తీసుకొని నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. ఇం దిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మేస్త్రీలు, ఇసుక, స్టీల్‌, కంకర, ఇటుక, అవసరమైన సామగ్రిని తక్కు వ ధరకు ఇచ్చేందుకు యాజమాన్యాలతో కమిటీలు వేసినట్లు చెప్పారు. మండలకేంద్రానికి మంజూరైన ఇళ్ల వివరాలు, వాటి నిర్మాణ దశలను అధికారులను అడిగారు. వివిధ దశలవారీగా పూర్తి చేసిన ఇళ్ల ఫొటోలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేయాలన్నారు.

Updated Date - Jul 26 , 2025 | 12:22 AM