Share News

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jun 18 , 2025 | 12:21 AM

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల నేపథ్యంలో వచ్చే మూడు నెలలు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగానే ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు

భువనగిరి (కలెక్టరేట్‌), జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల నేపథ్యంలో వచ్చే మూడు నెలలు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగానే ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. అన్ని గ్రామాల్లో ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు నిర్వహించాలన్నారు. దోమల నివారణకు ఫాగింగ్‌, మురుగుకాల్వల్లో ఆయిల్‌ బాల్స్‌ వేయాలన్నారు. పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం వహించకుండా రానున్న మూడు నెలలు జాగ్రత్తగా ఉండి వైద్య సేవలు అందించాలన్నారు. అంగన్‌వాడీలు, ప్రభుత్వ వసతి గృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో ఎన్‌.శోభారాణి, డీపీవో సునంద, డీఎంహెచ్‌వో మనోహర్‌, మిషన్‌ భగీరథ ఈఈ కరుణాకరణ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్యాంసుందర్‌, తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలి

భువనగిరి రూరల్‌: లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకునేలా అధికారులు చొరవ చూపాలని అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు అన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భువనగిరి మండలానికి రెండు విడతల్లో మొత్తం 670 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, సుమారు 460 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. ప్రభుత్వ నిబంధనలు, నాణ్యత ప్రమాణాలు పాటించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. మిగతా 110 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేందుకు లబ్ధిదారులతో మాట్లాడుతున్నట్టు ఎంపీడీవో సీహెచ్‌.శ్రీనివా్‌స తెలిపారు. సమావేశంలో ఎంపీవో ఎం.దినకర్‌, కార్యాలయ సూపరింటెండెంట్‌ శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 12:21 AM