Share News

బిహార్‌లో లబ్ధికోసమే బీసీ కులగణన డ్రామా

ABN , Publish Date - Jul 25 , 2025 | 12:55 AM

బిహార్‌ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే దేశవ్యాప్త బీసీ కులగణన డ్రామాకు బీజేపీ తెరలేపిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం ఆరోపించారు.

బిహార్‌లో లబ్ధికోసమే బీసీ కులగణన డ్రామా
మాట్లాడుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని

సూర్యాపేట టౌన, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : బిహార్‌ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే దేశవ్యాప్త బీసీ కులగణన డ్రామాకు బీజేపీ తెరలేపిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షనహాల్‌లో ఏర్పాటుచేసిన కేవీపీఎస్‌ రాష్ట్రస్థాయి సామాజిక శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగంతో బడుగు, బలహీన వర్గాలకు వస్తున్న కొద్దిపాటి ప్రయోజనాన్ని పొందకుండా చేయాలనే బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్ల సమీక్ష జరపాలంటున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం గతంలో పౌరసత్వం చట్టం మార్పుల పేరుతో మైనార్టీలను దేశం నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేసిందన్నారు. దేశవ్యాప్త నిరసన రావడంతో ఆ ప్రయత్నాన్ని నిలిపివేసిందని గుర్తుచేశారు. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకతపై పార్లమెంట్‌లో చర్చ జరపాలన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల హామీలను తప్పించుకునేందుకే కాళేశ్వరం, ఫోనట్యాపింగ్‌, ఫార్మూలా కార్‌రేస్‌ అంటూ రోజుకో టికెట్‌ లేని సినిమాను చూపిస్తున్నారని విమర్శించారు. ప్రజాసమస్యలను వదిలేసి కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారన్నారు. డబ్బుల్లేవని ముందే తెలిసినా ఎందుకు హామీలిచ్చారని ప్రశ్నించారు. కార్యక్రమంలో నాయకులు స్కైలాబ్‌, కోటగోపి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2025 | 12:55 AM