Share News

బక్రీద్‌ ప్రశాంతంగా నిర్వహించాలి

ABN , Publish Date - May 31 , 2025 | 12:02 AM

బక్రీద్‌ పండుగను ప్రజ లు ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు అన్నారు. బక్రీద్‌ పండుగ శాంతిసంఘం సమావేశంలో శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. భువనగిరి జోన్‌ డీసీపీ ఆకాంక్ష్‌ యాదవ్‌తో కలిసి ఈ సమావేశంలో కలెక్టర్‌ పాల్గొని మత పెద్దల సూచనలు, సలహాలను స్వీకరించి మాట్లాడారు.

బక్రీద్‌ ప్రశాంతంగా నిర్వహించాలి

శాంతిసంఘం సమావేశంలో కలెక్టర్‌హనుమంతరావు

భువనగిరి (కలెక్టరేట్‌), మే 30 (ఆంధ్రజ్యోతి): బక్రీద్‌ పండుగను ప్రజ లు ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు అన్నారు. బక్రీద్‌ పండుగ శాంతిసంఘం సమావేశంలో శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. భువనగిరి జోన్‌ డీసీపీ ఆకాంక్ష్‌ యాదవ్‌తో కలిసి ఈ సమావేశంలో కలెక్టర్‌ పాల్గొని మత పెద్దల సూచనలు, సలహాలను స్వీకరించి మాట్లాడారు. బక్రీద్‌ పండగ నేపఽథ్యంలో ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈద్గాల వద్ద మౌలిక వసతులు కల్పించి నమాజ్‌ వేళల్లో విద్యుత్‌ అంతరాయం లే కుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మసీదుల వద్ద పారిశుధ్య చర్యలు చేపట్టాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా వేస్టేజ్‌ కవర్లను పంపిణీ చేయాలన్నారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందు లు రావద్దని, సమయానికి నీరు వచ్చేలా చూడాలన్నారు. ఎలాంటి సంఘటనలు జరుగకుండా ప్రశాంత వాతావరణంలో పండగ నిర్వహించుకోవాలన్నారు. డీసీపీ అక్షాంశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ బక్రీద్‌ పండుగ సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, పూర్తి బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పండగ సామరస్యంగా జరుపుకోవాలన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, భువనగిరి ఆర్డీవో ఎం.కృష్ణారెడ్డి, డీపీవో సునంద,పశు వైద్యాధికారిజానయ్య, మతపెద్దలు, అధికారులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలి

వలిగొండ: ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని గోకారం ఐకేపీ, పీఎసీఎస్‌ ధ్యానం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి కొనుగోలు కేంద్రాల్లో మిగిలి ఉన్న ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేయాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని, పెండింగ్‌ లేకుండా రైతుల వివరాలు ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 48గంటల లోపే ప్రభుత్వం రైతుల ఖాతాలో డబ్బు జమ చేస్తోందన్నారు. ఆయన వెంట ఆర్డీవో శేఖర్‌రెడ్డి, డీఆర్డీవో నాగిరెడి, సివిల్‌ సప్లయ్స్‌ డీఎం హరికృష్ణ, ఇన్‌చార్జి పౌరసరఫరాల అధికారి రోజారాణి, తహసీల్దార్‌ దశరథ, ఏపీఎం జానీ, మాజీ ఎంపీపీ నూతి రమే్‌షరాజు, నాయకులు సంజీవరెడ్డి, కృష్ణ, తదితరులు ఉన్నారు.

Updated Date - May 31 , 2025 | 12:02 AM