ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకోవాలి
ABN , Publish Date - Apr 26 , 2025 | 12:32 AM
పహల్గాం ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని ప్రజలు గొంతెత్తుతున్నారు. శుక్రవారం భువనగిరిలో ముస్లిం సంఘాలు, భువనగిరి క్లబ్‌తో పాటు పలు సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు.
భువనగిరి టౌన్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): పహల్గాం ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని ప్రజలు గొంతెత్తుతున్నారు. శుక్రవారం భువనగిరిలో ముస్లిం సంఘాలు, భువనగిరి క్లబ్‌తో పాటు పలు సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. పాకిస్తాన్, ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు అంతా కట్టుబడి ఉంటారని, దాడులను మతాలకు ముడి పెట్టవద్దని నినాదాలు చేశారు. మృతులకు నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అవేజ్‌చిస్తీ, మునిసిపల్ మాజీ చైర్మన్లు బర్రె జహంగీర్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, ఎనబోయిన ఆంజనేయులు, పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్‌కుమార్, బీజేపీ, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం, ఏవీ కిరణ్‌కుమార్, కాలేరు వినోద్‌కుమార్, ఇట్టబోయిన గోపాల్, భాషబోయిన రాజేష్, బజరంగ్ ప్రసాద్ సాహూ, మాయ శివాజీ, ఎండి అతహర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే అంజుమన్ కమిటీ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఎండీ.రహీం మాట్లాడుతూ ఉగ్రదాడిని ఖండించారు. కార్యక్రమంలో ఎండీ.షరీఫ్, ఎండీ.ఇక్బాల్‌చౌదరి, తదితరులు పాల్గొన్నారు.