Share News

మహిళలపై దాడులను అరికట్టాలి: అనురాధ

ABN , Publish Date - Jun 27 , 2025 | 11:44 PM

మహిళలు, చిన్నారులపై దాడులు, దౌర్జన్యాలను అరికట్టాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ డిమాండ్‌చేశారు.

మహిళలపై దాడులను అరికట్టాలి: అనురాధ

భువనగిరి గంజ్‌, జూన 27 (ఆంధ్రజ్యోతి) : మహిళలు, చిన్నారులపై దాడులు, దౌర్జన్యాలను అరికట్టాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ డిమాండ్‌చేశారు. జిల్లా కేంద్రంలోని శుక్రవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ చదువుకున్న మహిళలకు ఉపాధి కల్పించాలని కోరారు. మద్యం, మత్తు పదార్థాల కారణంగా యువత పెడదారి పడుతోందని అన్నారు. మహిళలు, చిన్నారుల రక్షణ చట్టాలను అమలు చేయాలన్నారు. మహిళలపై దాడులకు పాల్పడేవారిని శిక్షించాలన్నారు. కార్యక్రమంలో మాయ రాణి, బాలమణి, లావణ్య, విజయ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2025 | 11:44 PM