Share News

అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం అందించాలి

ABN , Publish Date - Mar 12 , 2025 | 12:04 AM

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఎస్సీ, ఎస్టీ కమిషన రాష్ట్ర చైర్మన బక్కి వెంకటయ్య అన్నారు.

 అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం అందించాలి
కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన చైర్మన బక్కి వెంకటయ్య, పక్కన కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవార్‌

ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర కమిషన చైర్మన బక్కి వెంకటయ్య

సూర్యాపేట(కలెక్టరేట్‌), మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఎస్సీ, ఎస్టీ కమిషన రాష్ట్ర చైర్మన బక్కి వెంకటయ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కమిషన సభ్యులు జిల్లా శంకర్‌, రాంబాబునాయక్‌, నీలాదేవి, లక్ష్మీనారాయణతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఎం అజయ్‌ పథకం కింద లబ్ధిదారులను త్వరగా ఎంపిక చేసి వారి బోర్ల ద్వారా భూములకు సాగునీటి వసతి ఏర్పాటు చేయాలన్నారు. అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల్లో ఎస్సీ, ఎస్టీలకు అవకాశం కల్పించాలన్నారు. సూర్యాపేటలో పరువు హత్యకు గురైన మాల బంటి కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని, నిందితులకు త్వరగా శిక్షలు పడేలా చూడాలన్నారు. బాధితురాలు భార్గవికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, పింఛన, భద్రత, వ్యవసాయ భూమి వంటివి కల్పించాలని సూచించారు. ఎస్సీ కార్పొరేషన ద్వారా దళితబంధు రాని అర్హులైన ఎనిమిది కుటుంబాలకు డబ్బులు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి నెలా చివరిరోజున పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించాలని, విధిగా ఎస్‌ఐ, తహసీల్దార్లు హాజరుకావాలన్నారు. అంతకుముందు కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌ పవార్‌ జిల్లాలోని వివిధ శాఖల ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ది, సంక్షేమంపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన ద్వారా కమిషన చైర్మనకు వివరించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓవర్‌సీస్‌ విద్యానిధి పథకం కింద 103 మంది విద్యార్థులకు రూ.20లక్షల చొప్పున మంజూరు చేశామన్నారు. ఎస్సీ కార్పొరేషన ద్వారా 3,788మంది లబ్ధిదారులకు రూ.4261.40లక్షలు మంజూరు చేశామన్నారు. పీఎం అజయ్‌ పథకం కింద మైనర్‌ ఇరిగేషన ద్వారా మూడు యూనిట్లు, ఆర్థిక చేయూత కోసం 39 యూనిట్లకు రూ.32.83లక్షలు మంజూరయ్యాయన్నారు. దళితబంఽధు పథకం కింద 2,560 మందికి రూ.33.125 కోట్లు ఇచ్చామన్నారు. భూమి కొనుగోలు పథకం కింద 46 మంది రైతులకు రూ.6.58కోట్లతో 128.13ఎకరాలను పంపిణీ చేశామన్నారు. జిల్లాలో 232 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కాగా 169 కేసులు ఛార్జీషీట్‌ దాఖలు చేయడం జరిగిందన్నారు. మాల బంటి భార్య భార్గవి విద్యార్హత మేరకు ఉద్యోగం కల్పిస్తామని, కేసారంలో డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు ఇస్తామన్నారు. భార్గవి ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీ్‌సభద్రత కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ కమీషన చైర్మన వెంకటయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని 25జిల్లాల్లో సమీక్షా, సమావేశాలు నిర్వహించామని, సూర్యాపేట జిల్లాలో అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన ద్వారా వివరించడం, బుక్‌లెట్‌ తయారుచేసి అందించడం సంతోషదాయకమన్నారు. కలెక్టర్‌ ఎంతో కష్టపడి జిల్లాను అభివృద్ధి పథంలో ముందంజలో ఉంచుతున్నారని అందుకుగాను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కమిషన చైర్మనతో పాటు సభ్యులు కలెక్టర్‌ను ఘనంగా సన్మానించారు. సమావేశంలో ఎస్పీ కొత్తపల్లి నర్సింహ, అదనపు ఎస్పీ మేక నాగేశ్వర్‌రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

దాడులను అరికట్టాలి

సూర్యాపేటటౌన, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): లంబాడి, గిరిజనులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని లంబాడీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు ధరావత బాలునాయక్‌ అన్నారు. కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ కమిషన చైర్మన బక్కి వెంకటయ్యకు వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. కార్యక్రమంలో ఆల్‌ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు సురే్‌షనాయక్‌, లంబాడివిద్యార్థిసేన జిల్లా అధ్యక్షుడు హరీ్‌షనాయక్‌, నర్సింహనాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2025 | 12:05 AM